AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya Trisha: ఎట్టకేలకు విడుదలైన సూర్య, త్రిష సినిమా.. క్షమాపణలు చెప్పిన మేకర్స్.. ఎందుకంటే..

సాధారణంగా కొన్ని సినిమాలు విడుదలకు ముందే పలు వివాదాల్లో చిక్కుకుంటాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం ఎలాంటి ఇష్యూస్ లేకపోయినా రిలీజ్ కావడానికి ఆలస్యమవుతుంటుంది. ఇప్పుడు కరుప్పు విషయంలోనూ అదే జరిగింది. సూర్య, త్రిష కలిసి నటించిన ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది.

Suriya Trisha: ఎట్టకేలకు విడుదలైన సూర్య, త్రిష సినిమా.. క్షమాపణలు చెప్పిన మేకర్స్.. ఎందుకంటే..
Karuppu
Rajitha Chanti
|

Updated on: May 15, 2026 | 12:19 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కరుప్పు. డైరెక్టర్ ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడు పేరుతో తీసుకువస్తున్నారు. ఇందులో సూర్య సరసన త్రిష కథానాయికగా నటించగా.. ఇదివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని పెంచాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు ఫ్యాన్స్. నిజానికి ఈ సినిమా మే 14న విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వల్ల షో రద్దు చేశారు. దీంతో డైరెక్టర్ ఆర్జే బాలాజీ భావోద్వేగానికి గురయ్యారు. ఆయనకు సపర్ట్ చేస్తూ పలువురు స్టార్స్ సైతం పోస్టులు పెట్టారు. అయితే 24 గంటల తర్వాత అంటే మే 15న ఈ సినిమా ఎట్టకేలకు విడులైంది. ప్రస్తుతం ఈ చిత్రానికి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

అయితే తాజాగా ఈ సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్షర్స్ ఓపోస్ట్ చేసింది. కొన్ని సినిమాలు తమను పరీక్షిస్తాయని చెప్పుకొచ్చింది. “సమయాన్ని మాత్రమే కాకుండా కొన్నిసార్లు హృదయాలను పరీక్షించే ప్రయాణాలు ఎదురవుతాయి. కరుప్పు సినిమా కోసం ఎదురుచూసి.. ప్రతిక్షణం ఆ మూవీ గురించి ఆరాతీస్తూ మా ఆలస్యాన్ని భరిస్తూ మాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నాము. ఈ ఎదురుచూపు ఎంత బాధాకరమైనదో మాకు తెలుసు. మీలో చాలా మంది ఎంతో ప్రేమతో, అంచనాలతో ఈ సినిమా కోసం వేచి ఉన్నారని మాకు తెలుసు. సినిమా ఆలస్యం కావడంతో మేము చాలా బాధపడ్డాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాపై చూపిన ప్రేమే ఈ సినిమాను మీ ముందుకు తీసుకువచ్చింది ” అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

కరప్పు సినిమా విడుదలకు ముందే చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. గత చిత్రాలకు సంబంధించిన ఫైనాన్సియర్లకు చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో సర్దుబాటు కాకపోవడంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాలేదు. చర్చల తర్వాత ఈ చిత్రాన్ని ఇప్పుడు అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు మేకర్స్.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

Follow Us
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక
రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే
రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే