AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Camp: ఈ చిన్నారులు వెరీ వెరీ స్పెషల్.. వేసవి సెలవుల్లో యక్షగానం నేర్చుకుంటున్న పిల్లలు

వేసవి సెలవులు వచ్చేశాయి. దీంతో పిల్లలు తమ సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. కొంతమంది పిల్లలు వేసవి సెలవుల్లో ఈత, క్రికెట్, డ్రాయింగ్ నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. సమ్మర్ కోచింగ్ సెంటర్స్ కు వెళ్తారు. అయితే అందరికంటే భిన్నంగా కొంతమంది పిల్లలు యక్షగానం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిన్న పిల్లలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఈ వేసవిలో ఈ చిన్నారులు ఏమి చేస్తున్నారనేది తెలుసుకుందాం..

Summer Camp: ఈ చిన్నారులు వెరీ వెరీ స్పెషల్.. వేసవి సెలవుల్లో యక్షగానం నేర్చుకుంటున్న పిల్లలు
Children Summer Camp
Surya Kala
|

Updated on: Apr 30, 2025 | 6:51 PM

Share

వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయంటేనే బాబోయ్ మా పిల్లల అల్లరిని ఎలా తట్టుకోగలం అంటూ భయపడతారు. సెలవులు ప్రారంభమవుతుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి శిబిరాల్లో చేర్పించి తద్వారా తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే కొంతమంది పిల్లలు మాత్రం భిన్నమైన అభిరుచిని ప్రదర్శిస్తున్నారు. కొంత మంది చిన్నారులు ఇంట్లో యక్షగానం ప్రదర్శిస్తున్నారు. ఈ వీడియో జనప్రతినిధి అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు.

అవును ఇప్పుడు పిల్లలు వేసవి సెలవుల్లో క్యాంపులు, ఈత కొట్టడం, డ్రాయింగ్ వంటి ఆసక్తికరమైన విషయాలను నేర్పించడానికి వివిధ శిక్షణాతరగతుల్లో చేరుస్తున్నారు. కొంతమంది పిల్లలు ఆటలు ఆడుతూ వేసవి సెలవులను ఆస్వాదిస్తున్నారు. అయితే కొంతమంది పిల్లలు ప్రత్యేక ఆసక్తులతో వెరీ వెరీ స్పెషల్ గా నిలుస్తున్నారు. కొంతమంది పిల్లలు ఆడుకోవడానికి బదులుగా యక్షగానం ప్రదర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పిల్లలు ఆటల్లో బిజీగా ఉండగా.. ఈ చిన్నారులు తీరప్రాంత యుద్ధ కళలను, సాంప్రదాయ కళలను అభ్యసిస్తున్నారు. ఒకటవ తరగతి విద్యార్థి శాశ్వత భగవతి పాట పాడుతుండగా.. మరో చిన్నవాడు చందే వాయిస్తూ బిజీగా ఉన్నాడు. మరొకరు భాగవతీక పాటకు యక్షగాన నృత్యం చేయడం చూడవచ్చు. ఈ పిల్లలకు యక్షగానం పట్ల ఎంత ఆసక్తి ఉందో చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం.

మరిన్ని వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..