AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Shakti Rekha: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..

భారతదేశంలో అద్భుతమైన దేవాలయాలు, మిస్టరీ ప్రదేశాలున్నాయి. కొన్ని ఆలయాల నిర్మాణం నేటి ఆధునిక సాంకేతికతకు, సైన్స్ కు సవాల్ చేస్తున్నాయి. అదే సమయంలో శతాబ్దాల క్రితం పూర్వీకుల ఆలోచన, తెలివి తేటలు ఆశ్చర్యపరుస్తునే ఉన్నాయి. అటువంటి ఒక నిర్మాణమే ఒకే రేఖాంశం మీద నిర్మించిన అద్భుతమైన శివాలయాల నిర్మాణం. శతాబ్దాల క్రితమే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, GPS వంటి సాధనాలను ఉపయోగించకుండానే మన పూర్వీకులు ఎలా నిర్మించారు అని ఆలోచిస్తారు.

Shiva Shakti Rekha: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
Shiva Shakti Aksh Rekha
Surya Kala
|

Updated on: Apr 30, 2025 | 5:00 PM

Share

శతాబ్దాల క్రితమే ఎటువంటి అధునాతన సౌకర్యాలు, సాంకేతికతలు లేకుండా మన పెద్దల బలం, సామర్థ్యం, ​​నిర్మాణ జ్ఞానం, అద్భుతమైన తెలివితేటలతో.. నేటి సైన్స్ కూడా చేధించలేని అనేక అద్భుతమైన దేవాలయాలను, అద్భుత ప్రదేశాలను నిర్మించారు. మన భారతదేశంలో శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న అనేక దేవాలయాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. అవి వేటికవే అద్భుతంగా అనిపిస్తూ తమ వైభవాన్ని నిలుపుకుంటున్నాయి. అలాంటి అద్భుతాలలో 8 పురాతన శివాలయాలు ఉన్నాయి. ఉత్తరాన కేదార్‌నాథ్ నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు ఒకే రేఖాంశంలో అద్భుతమైన శివాలయాలను శతాబ్దాల క్రితంమే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం లేదా GPS వంటి పరికరాలను ఉపయోగించకుండా నిర్మించారు. ఇలా ఒకే రేఖాంశంలో ఉన్న పురాతన శివాలయాలు ఏమిటో తెలుసుకుందాం..

ఒకే రేఖాంశంలో ఉన్న పురాతన శివాలయాలు:

ఇలా ఒకే రేఖాంశం మీద ఉన్న ఎనిమిది దేవాలయాలు, 4000 సంవత్సరాల క్రితం నిర్మించారని నమ్ముతారు. ఇవి 79° రేఖాంశంలో ఉన్నాయి. ఉత్తరాన కేదార్‌నాథ్ నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు భారతదేశం అంతటా ఉన్న సరళ రేఖలో నిర్మించబడ్డాయి. ఈ రేఖను “శివ-శక్తి రేఖ” అని పిలుస్తారు. ఈ మార్గం కేదార్‌నాథ్ నుంచి ప్రారంభమై రామేశ్వరంలో ముగుస్తుంది. ఈ ఎనిమిది శివాలయాలు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు తరాలు వీటిని నిర్మించబడినప్పటికీ.. అవి ఖచ్చితంగా 79° రేఖాంశంలో నిర్మించబడ్డాయి. ఇది నిస్సందేహంగా మన పూర్వీకుల అద్భుతమైన జ్ఞానం, ఖగోళ ఖచ్చితత్వానికి నిదర్శనం.

ఒకే రేఖాంశంలో ఉన్న 8 శివాలయాలు ఏమిటి?

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం (79.0669°), ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తీశ్వరాలయం (79.7037°), తమిళనాడులోని కంచిలోని ఏకాంబరేశ్వరాలయం (79.7036°), తమిళనాడులోని తిరువణ్ణామలైలోని అన్నామలైయర్ ఆలయం (79.0747°), తమిళనాడులోని చిదంబరంలోని నటరాజ ఆలయం (79.6954). రామస్వామి ఆలయం) (79.3129°), తెలంగాణలోని కాళేశ్వరం దేవాలయం (79.9067°) అన్నీ ఒకే రేఖాంశంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అంతేకాదు ఈ 8 శివాలయాల్లో ఐదు పంచభూతాల అంశాలను సూచిస్తున్నాయి. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. శ్రీ కాళహస్తిలోని శివలింగం గాలిని సూచిస్తే, తిరువణ్నైకావల్‌లోని జంబుకేశ్వర ఆలయంలోని లింగం నీటిని సూచిస్తుంది. అన్నామలైయార్ శివలింగం అగ్నిని సూచిస్తుంది. కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలోని లింగం భూమిని సూచిస్తుంది. చిదంబరంలోని నిరాకార శివలింగం ఆకాశపు తత్వాన్ని సూచిస్తుంది.

ఈ శివాలయాలన్నీ దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఉపగ్రహాలు, సాంకేతికత లేదా GPS లేని యుగంలో, యోగా శాస్త్రాన్ని ఉపయోగించి అక్షాంశం, రేఖాంశాల ఖచ్చితమైన కొలతలతో నిర్మించబడ్డాయి. అవి వేర్వేరు సమయాల్లో నిర్మించబడినప్పటికీ ఈ దేవాలయాలు వాటి ఖచ్చితమైన ప్రదేశాలలో ఎలా నిర్మించబడ్డాయనేది నేటికీ ఒక రహస్యంగానే ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు