Vastu Tips: వంట గదిలో పాత్రలను తలక్రిందులుగా ఎందుకు పెట్టుకోకూడదో మీకు తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం, ఇంట్లో పెట్టె వస్తువుల విషయంలో కూడా నియమాలున్నాయి. వంటగది పాత్రలను సరిగ్గా ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. పాత్రలను తలక్రిందులుగా ఉంచకూడదు.ఎందుకంటే ఇది ప్రతికూలతను ఆహ్వానిస్తుంది. అంతేకాదు వాస్తు ప్రకారం.. మాత్రమే కాదు ఆరోగ్య పరంగా కూడా వంటగదిని శుభ్రంగా ఉంచడం చాలా అవసరం.

హిందూ మతం, వాస్తు శాస్త్రం రెండింటిలోనూ వంటగదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో ఉంచిన వస్తువులను సరైన దిశలో సరైన మార్గంలో ఉంచితేనే ఆ ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుందని చెబుతారు. దీని ప్రకారం వంట పాత్రలను ఏ స్థితిలో ఉంచాలో వాస్తు ఎప్పటికప్పుడు ప్రస్తావించబడింది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
వంటగదిలో పాత్రలు పెట్టుకునే విషయంలో కొన్ని నియమాలున్నాయి. వంట పాత్రలను తలక్రిందులుగా పెట్టుకోకూడదు. పాత్రలను తలక్రిందులుగా పెట్టడం వల్ల ప్రతికూలత వస్తుంది. అలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టం, దురదృష్టం.. వివాదాలు వస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది మాత్రమే కాదు దోస, చపాతీలను వేయించే ఇనుప అట్ల పెనం పెట్టుకోవడానికి కూడా నియమాలున్నాయి. తవాను తిరగవేసి పెట్టారాదు. ఇలా చేయడం వలన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. అప్పులు పెరగవచ్చు. జీవితంలో ఆర్ధిక ఇబ్బందులతో పాటు పేదరికాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. పనిలో అంతరాయాలు ఏర్పడవచ్చు. అలా చేయడం వల్ల, వైవాహిక జీవితంలో చీలికలు, గృహంలో కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు.. స్నేహితులతో తగాదాలు పెరిగే అవకాశం కూడా ఉందట.
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం వంటగదిలోని పాత్రలను ఎల్లప్పుడూ పశ్చిమ దిశలో ఉంచాలి. ఈ దిశలో కంటైనర్లను ఉంచడం ఉత్తమం. ఇది ఆనందం , శ్రేయస్సును పెంచుతుందని భావిస్తారు.
అంతేకాదు అన్నిటికంటే ముఖ్యమైనది రాత్రి ఉపయోగించిన గిన్నెలను రాత్రే శుభ్రం చేసుకోవాలి. అంతేకాని తెల్లవారిన తర్వాత గిన్నెలు కడుగుదాం అని వంట ఇంటి సింక్ లో నిల్వ చేయవద్దు. అలాగే వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








