- Telugu News Photo Gallery Spiritual photos Bamboo plants benefits as per Vastu shastra and Feng Shui know the details
Vastu Tips: ఈ దిశలో ఉంచిన వెదురు మొక్క అద్భుతాలు చేస్తుంది.. అదృష్టం మీ సొంతం..
వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాదు.. ఇంట్లోని వస్తువులను కూడా వాస్తుని అనుసరించి ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా ఇంట్లోని పెట్టుకునే మొక్కల విషయంలో కూడా వాస్తు నియమాలను అనుసరించాలి. అదృష్టాన్నితీసుకొస్తుందని వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే సరైన దిశలో వెదురు మొక్కను ఉంచండి. ఇలా చేయడం ఇంటికి అందాన్ని మ అదృష్టాన్ని తీసుకొస్తుంది.
Updated on: Apr 30, 2025 | 2:26 PM

మనిషి జీవితంలో మొక్కలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. మొక్కలు ఉన్న స్థలం అందంగా.. ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాదు శక్తివంతమైన శక్తి కేంద్రంగా కూడా పనిచేస్తాయి. మొక్కలు ఇల్లు లేదా ఆఫీసు వాతావరణాన్ని మార్చగలవు. సరైన వాస్తు స్థానాన్ని అనుసరించి ఉంచినట్లయితే.. మొక్కలు అద్భుతాలు చేయగలవు. వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్ రెండింటిలోనూ వెదురు మొక్కలను పెంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వెదురు మొక్కలను సరైన దిశలో ఉంచితే అవి అదృష్ట ఆకర్షణగా పనిచేస్తాయని అంటారు. వెదురు మొక్కలు జీవితంలో స్వస్థత, పెరుగుదలకు చిహ్నంగా పరిగణించబడుతున్నాయి.

వెదురు మొక్కను వాస్తు-అనుకూల దిశలో ఉంచండి. ఇంటి లోపల వెదురు మొక్కను ఉంచడానికి తూర్పు దిక్కు, ఆగ్నేయ దిశ అనువైనవి.

ఆగ్నేయ దిశ: ఆగ్నేయ దిశ జీవితంలో ధన ప్రవాహాన్ని సూచిస్తుంది. సంపదకు కొరత లేకుండా జీవితాంతం ఉండాలంటే వెదురు మొక్కను ఉంచడానికి ఇది ఉత్తమ దిశ. శ్రేయస్సును ఆకర్షించే దీని లక్షణాలను పెంచడానికి ఆకుపచ్చ, పసుపు లేదా బంగారు రంగు కుండలను ఉపయోగించండి. శ్రేయస్సును పెంపొందించడానికి వెదురు మొక్క చుట్టూ ఎర్రటి రిబ్బన్ కట్టండి. వెదురు విరగకుండా వంగగల సామర్థ్యం అనుకూలత .. బలానికి చిహ్నంగా చెబుతారు.

తూర్పు దిశ: వెదురు మొక్కను ఉంచడానికి తూర్పు దిశ ఉత్తమ దిశలలో ఒకటి ఎందుకంటే ఇది సానుకూల శక్తిని సూచిస్తుంది. వెదురు మొక్కలు సానుకూల శక్తిని కలిగి ఉంటాయి. కనుక వీటిని ఇంట్లో పెంచుకోవడం వలన ఇంట్లో సామరస్యాన్ని, అదృష్టాన్ని తీసుకువస్తాయి

ఉత్తర దిశ: ఉత్తర దిశ వృద్ధి , శ్రేయస్సును సూచిస్తుంది. ఈ దిశలో వెదురు వేగంగా పెరగడం జీవితంలో పైకి ఎదిగేందుకు, విజయంతో ముడిపడి ఉంటుందని.. సంపద, శాంతి, ఆనందాన్ని ఆకర్షిస్తుందని చెబుతారు. కెరీర్ వృద్ధి , విజయానికి శక్తినివ్వడానికి ఆఫీసులో లేదా ఇంటి ఉత్తర దిశలో వెదురు మొక్కను ఉంచండి.

ఈశాన్య దిశ: వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశ మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మొక్కను ఈశాన్య దిశలో ఉంచడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. వెదురును ఒక గాజు పాత్రలో చిన్న తెల్లటి గులకరాళ్ళు.. నీటితో ఉంచండి. ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతతను పెంచుతుంది.




