AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakebite Cases: పాములు బాబోయ్ పాములు.. కాటు మీద కాటు వేస్తున్నాయ్..! 120 రోజుల్లో 3 వేలకు పైగా కేసులు..

పాము కాటు కేసుల పెరుగుదల నేపథ్యంలో TV9 ప్రజల్ని హెచ్చరిస్తూ, పాముల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? పాము కాటు నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ పలు కార్యక్రమాలను టీవీ9 కన్నడ ప్రసారం చేసింది. దాంతో అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు పాము కాటు మరణాలపై సీరియస్‌ యాక్షన్‌ మొదలుపెట్టింది.

Snakebite Cases: పాములు బాబోయ్ పాములు.. కాటు మీద కాటు వేస్తున్నాయ్..! 120 రోజుల్లో 3 వేలకు పైగా కేసులు..
Snakebite Cases
Jyothi Gadda
|

Updated on: Apr 30, 2025 | 1:27 PM

Share

కర్ణాటకలో పాము కాటు కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేవలం 120 రోజుల్లోనే 3259 కేసులు నమోదయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, 20 మంది పాముకాటుతో మరణించారు. పాము కాటు కేసుల పెరుగుదల నేపథ్యంలో TV9 ప్రజల్ని హెచ్చరిస్తూ, పాముల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? పాము కాటు నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ పలు కార్యక్రమాలను టీవీ9 కన్నడ ప్రసారం చేసింది. దాంతో అప్రమత్తమైన కర్ణాటక ఆరోగ్య శాఖ ఇప్పుడు పాము కాటు మరణాలపై సీరియస్‌ యాక్షన్‌ మొదలుపెట్టింది.

సిలికాన్ సిటీ బెంగళూరును చేర్చడంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఇది ఆరోగ్య శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత వారంలోనే 243 పాముకాటు కేసులు నమోదయ్యాయి. ఈ బాధితుల్లో ఇద్దరు పాముకాటుకు గురై మరణించారని తెలిసింది. ఇక ఈ ఏడాది జనవరి నుండి 3259 మంది పాములు కాటుకు గురయ్యారు. 20 మంది మరణించారు. రాష్ట్రంలో పెరుగుతున్న పాముకాటు కేసులతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ పాముకాటు కేసులు, మరణాలపై ఆడిట్ నిర్వహించాలని యోచిస్తోంది.

గత మూడేళ్లలో రాష్ట్రంలో 60 మందికి పైగా పాముకాటుతో మరణించారని సమాచారం. కొందరు సకాలంలో చికిత్స అందక మరణించారు. మరికొందరు మందులు దొరకక మరణించారు. మూడు సంవత్సరాలలో 15,000 మంది పాములు కాటుకు గురయ్యారు. ఈ సంఖ్య ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉంది. పాముకాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మండలాలు, జిల్లా ఆసుపత్రులు పాముకాటు చికిత్సకు అవసరమైన మందులను నిల్వ ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా