AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight: విమానంలో అభ్యంతరకర దృశ్యాలు ప్రసారం.. పాడు సినిమాపై ప్రయాణికుల ఆగ్రహం..

ఆ విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలోని స్క్రీన్లలో అభ్యంతరకర దృశ్యాలు ప్రసారం అయ్యాయి. అది ‘అడల్ట్‌ కంటెంట్’ కావడంతో ప్రయాణికుల్లో కొందరు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాటిని ఆఫ్ చేయలేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

Flight: విమానంలో అభ్యంతరకర దృశ్యాలు ప్రసారం.. పాడు సినిమాపై ప్రయాణికుల ఆగ్రహం..
Adult Movie Shocks Passengers
Jyothi Gadda
|

Updated on: Oct 07, 2024 | 4:26 PM

Share

విమానంలోని ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అన్ని స్క్రీన్‌లపై అసభ్యకరమైన వీడియో ప్లే అయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి జపాన్‌కు బయలుదేరిన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలోని స్క్రీన్లలో అభ్యంతరకర దృశ్యాలు ప్రసారం అయ్యాయి. అది ‘అడల్ట్‌ కంటెంట్’ కావడంతో ప్రయాణికుల్లో కొందరు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాటిని ఆఫ్ చేయలేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

దీనిపై ప్రయాణికులు, ముఖ్యంగా పిల్లలున్న కుటుంబాలు తీవ్ర విమర్శలు చేశారు. వీడియోను పాజ్ చేయడం, ఆపడం సాధ్యం కాలేదని ప్రయాణికులు వాపోయారు. విమానంలో అలాంటి వీడియో ప్లే కావడం చూసి తాను షాక్ అయ్యానని, అభ్యంతరకర సినిమాను మార్చడానికి తమకు సుమారు గంట సమయం పట్టిందని ఒక ప్రయాణీకుడు పేర్కొన్నాడు.

దీంతో సాంకేతిక లోపం కారణంగానే అలా జరిగిందని విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగిందని వివరిస్తూ క్వాంటాస్ ఈ ఘటనను ధృవీకరించింది. వెంటనే సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై విచారిస్తున్నట్లు క్వాంటాస్ ప్రతినిధి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..