Model Chai Wali: మోడల్ చాయ్ వాలీ.. టీ తయారీ స్టైల్ చూసి బెంబేలెత్తిపోతున్న నెటిజన్లు..! చూస్తే అవాక్కే..
సిమ్రాన్ గుప్తా అనే యువతి ‘మోడల్ చాయ్ వాలీ’ అనే పేరుతో లక్నోలో ఒక టీ స్టాల్ స్టార్ట్ చేసింది. మోడల్ చాయ్ వాలీ అంటూ టీ స్టాల్లో ఆమె చాయ్ తయారు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె తన జుట్టుతో రకరకాలుగా ఫోజులిస్తున్న తీరుకు నెటిజన్లు
బిల్‌గేట్స్ మెచ్చిన నాగ్‌పూర్ డాలీ చాయ్ వాలా గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అతడు ఛాయ్ తయారు చేస్తున్న విధానం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో దేశవిదేశా్లలో డాలీ చాయ్ వాలా బాగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఒక మోడల్ సైతం టీ షాప్ ఓపెన్ చేసింది. ఆమె టీ స్టాల్ నడుపుతున్న వీడియోలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆమె తయారు చేస్తున్న టీ పై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారో తెలియాలంటే.. పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..
సిమ్రాన్ గుప్తా అనే యువతి ‘మోడల్ చాయ్ వాలీ’ అనే పేరుతో లక్నోలో ఒక టీ స్టాల్ స్టార్ట్ చేసింది. ఆమె టీ స్టాల్ నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు దాదాపు 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ది హంగ్రీ పంజాబీ అనే ఫుడ్ బ్లాగింగ్ చానల్ ఆమె టీ షాప్ వీడియో పోస్ట్ చేసింది. మోడల్ చాయ్ వాలీ అంటూ టీ స్టాల్లో ఆమె చాయ్ తయారు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె తన జుట్టుతో రకరకాలుగా ఫోజులిస్తున్న తీరుకు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటు.. ఎంబీఏ చాయ్ వాలా తనకు టీ షాప్ పెట్టడానికి ప్రేరణగా నిలిచారని చెప్పుకొచ్చింది. అయితే, ఆమె టీ చేస్తున్న వీడియో వైరల్‌గా మారండంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.
View this post on Instagram
2018లో మిస్ గోరఖ్‌పూర్ టైటిల్ విన్నర్ సిమ్రాన్ గుప్తా కొత్తగా టీ స్టాల్ రన్ చేస్తున్నారు. సిమ్రాన్ తయారు చేస్తున్న చాయ్‌పై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు.. ఆమె పెట్టిన టీ రుచి 2 శాతం ఉంటే.. తన ఓవరాక్టింగ్ 98 శాతం ఉందంటూ ఒకరు కామెంట్ చేయగా, టీ పెట్టండి కానీ, దానికి ముందు జుట్టును కట్టుకోండి.. అలా వదిలివేస్తే.. చాయ్‌లో పడుతుందంటూ మరొకరు సలహాలు ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..