Viral Video: ప్రమాదకర రక్తపింజర.. రోడ్డుపై మొబైల్‌లో పాట వస్తుంటే ఏం చేసిందంటే..?
రోడ్డుపై జనం ఎవరూ లేరు.. ఒక మొబైల్‌లో భోజ్‌పురి పాట ప్లే అవుతుంది. అప్పుడు అక్కడికి ఓ రక్తపింజర పాము వచ్చింది. అది ఏం చేసిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

భోజ్‌పురి పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గతంలో ఈ పాటలు ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలలో వినిపించేవి, కానీ ఇప్పుడు అవి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆఫ్రికాలో ప్రజలు భోజ్‌పురి పాటలకు డ్యాన్స్ చేసి వైరల్ అవతుున్నారు, కొరియా వంటి దేశాలలో, ప్రజలు భోజ్‌పురి మాట్లాడటం నేర్చుకుంటున్నారు. అయితే మనుషులు మాత్రమే కాకుండా ఇతర జీవులు కూడా భోజ్‌పురి పాటలకు స్పందించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో తెలుసా? తాజాగా అలాంటి వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం…
సదరు వీడియో ప్రజలను షాక్‌కి గురి చేస్తుంది. ఆ వీడియోలో ఒక పాము భోజ్ పురి నృత్య గీతాన్ని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక మొబైల్ ఫోన్ భోజ్ పురి నృత్య గీతాన్ని ప్లే చేస్తోండగా, పాము దానిపై దృష్టి పెట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఎవరో తమాషాగా ఆ పాము ముందు మొబైల్‌ను ఉంచి ఉండవచ్చని అంటున్నారు. అదేదో వింతలా అనిపించడంతో.. పాము ఆశ్చర్యపోయి అదే స్క్రీన్‌ను నిరంతరం చూస్తూనే ఉంది. పాము భోజ్‌పురి పాటను నిజంగా ఆస్వాదిస్తున్నట్లు చూపరులకు అనిపిస్తుంది. మాములుగా ఇందులోని పాము రక్తపింజర చాలా ప్రమాదకరమైనది. దూకుడు దాడికి ప్రసిద్ధి చెందింది. కానీ ఈ వీడియోలో అది చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. దీంతో పాములు కూడా అప్‌డేట్ అయ్యాయని.. భోజ్‌పురి పాటలకు అభిమానులుగా అయ్యాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోను raj.yaduvansi.961 అనే ఖాతా నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.9 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 3 లక్షల 77 వేలకు మందికి పైగా దీన్ని లైక్ చేశారు. అయితే పాముకి దగ్గరగా వెళ్లి, మొబైల్ పట్టుకుని వీడియో తీయడం చాలా ప్రమాదకర పని అని కొందరు హెచ్చరిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
