AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

93 ఏళ్ల వయసులో తండ్రైన వృద్దుడు.. మళ్ళీ బిడ్డని కోరుకుంటున్నాడు..

93 ఏళ్ల వృద్ధుడు తండ్రి అయ్యి ప్రపంచానికి షాకిచ్చాడు. ఈ వృద్ధుడి భార్యకి అతని మనవరాలి వయస్సు ఉంటుంది. తండ్రి కావడానికి వయసు అడ్డంకి కాదని అంటూనే.. తనకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఉందని చెబుతున్నాడు. అంతేకాదు తన కొడుకు 21వ పుట్టినరోజును అతనితో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

93 ఏళ్ల వయసులో తండ్రైన వృద్దుడు.. మళ్ళీ బిడ్డని కోరుకుంటున్నాడు..
Australian Doctor Becomes Father At 93
Surya Kala
|

Updated on: Oct 16, 2025 | 2:02 PM

Share

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన 93 ఏళ్ల వైద్యుడు వయసు ఒక నెంబర్ మాత్రమే.. పదవీ విరమణ అనేది జీవితం నుంచి కాదు, పని నుంచి మాత్రమే అని నిరూపించాడు. ఆరోగ్యకరమైన వృద్ధాప్య డాక్టర్ జాన్ లెవిన్ 93 ఏళ్ల వయస్సులో తండ్రి కావడం ద్వారా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. అయితే తాను ఇక్కడితో ఆగను అని .. మరింత మంది పిల్లలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

డాక్టర్ లెవిన్ 93 ఏళ్ళు.. అతని భార్య డాక్టర్ యాంగ్యింగ్ కి 37 ఏళ్లు. లెవిన్ కంటే భార్య 56 ఏళ్లు చిన్నది. ఇద్దరి మధ్య వయసు తేడా 56 ఏళ్లు. అంటే లెవిన్ భార్య వయస్సు అతని మనవరాలి వయస్సుతో సమానం. 2014లో లాస్ వెగాస్‌లో వివాహం చేసుకున్నారు. దంపతులు ఫిబ్రవరి 2024లో తమ కుమారుడు గ్యాబీని స్వాగతించారు. ఈ ప్రత్యేకమైన జంట ఇప్పుడు మరొక బిడ్డను స్వాగతించడానికి సిద్ధమవుతోంది.

మీడియా నివేదికల ప్రకారం లెవిన్ దంపతులు ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF), స్పెర్మ్ డొనేషన్ ద్వారా ఈ ఆనందాన్ని పొందుతున్నారు. డాక్టర్ లెనిన్ మాట్లాడుతూ “నేను ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలనుకుంటున్నాను” అని అన్నారు. తన కుమారుడు గ్యాబీ 21వ పుట్టినరోజున తాను .. తన కొడుకుతో ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే డాక్టర్ లెవిన్ కోరిక కనుక తీరితే.. కొడుక్కి 21వచ్చే సమయంలో డాక్టర్ లెవిన్ వయస్సు 116 సంవత్సరాలకు చేరుకుంటాడు. యూదు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం అయిన బార్ మిట్జ్వా ద్వారా గ్యాబీకి మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ఇది సాధారణంగా 13 సంవత్సరాల వయస్సులో జరుగుతుంది. ఈ వేడుక ఒక యూదు బాలుడు యుక్త వయస్సులోకి మారడాన్ని సూచిస్తుంది.

గ్యాబీ డాక్టర్ లెవిన్ కు నాల్గవ సంతానం. అతనికి మొదటి వివాహం ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరూ 60 ఏళ్ల వయసు వారు. అతనికి 10 మంది మనవరాళ్ళు , ఒక మునిమనవరాలు కూడా ఉన్నారు.

.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా