AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో పనిమనిషి జీతం రూ. 45 వేలు చెల్లిస్తుందట.. రష్యన్ మహిళ రాక్ .. ప్రజలు షాక్..

ప్రతి మనిషి తన సంపాదన ఎంత? దానికి అనుగుణంగా చేయాల్సిన ఖర్చు ఎంత అనే లెక్కలు వేసుకుంటాడు. ఇది సహజం.. అయితే నివసించే ప్రాంతం బట్టి కూడా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు బెంగళూరులో నివసించాలంటే నెలకు ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా అని ఒక రష్యన్ మహిళా చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా పని మనిషికి ఆమె ఇస్తున్న జీతం అందరికీ షాక్ ఇచ్చింది.

Viral Video: వామ్మో పనిమనిషి జీతం రూ. 45 వేలు చెల్లిస్తుందట.. రష్యన్ మహిళ రాక్ .. ప్రజలు షాక్..
Viral Video
Surya Kala
|

Updated on: Oct 16, 2025 | 12:19 PM

Share

బెంగళూరులో నివసించాలంటే చేయాల్సిన ఖర్చులకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. యులియా అస్లమోవా అనే రష్యన్ మహిళ ఇటీవల తన నెలవారీ ఖర్చుల జాబితాను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో కలకలం రేగింది. ఆ రష్యన్ మహిళ గత 11 సంవత్సరాలుగా భారతదేశ టెక్ హబ్‌లో నివసిస్తోంది. ఆమె చెప్పిన ఖర్చుల వివరాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

బెంగళూరులో ముగ్గురు సభ్యులతో కూడిన తన కుటుంబానికి నెలకు సుమారు ₹3 లక్షలు ఖర్చు అవుతుందని యులియా చెప్పారు. తన ఇంటి అద్దె ₹1.25 లక్షలు అని ఆమె చెప్పింది. అంతేకాదు తిండి, గృహోపకరణాల కోసం ₹75,000 ఖర్చు చేస్తుంది. స్కూల్ ఫీజుల కోసం ₹30,000, ఆరోగ్యం , ఫిట్‌నెస్ కోసం ₹30,000 ఖర్చు చేస్తుంది. పెట్రోల్ కోసం నెలకు ₹5,000 ఖర్చు చేస్తునట్లు చెప్పింది. అయితే ఆమె పని మనిషికి ఇస్తున్న జీతం గురించి విన్నాక అందరూ షాక్ తిన్నారు.

ఇవి కూడా చదవండి

పనిమనిషి జీతం గురించి గొడవ! యూలియా తన పనిమనిషికి నెలకు 45,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు వీడియోలో వెల్లడించినప్పుడు ప్రజలు షాక్ అయ్యారు. ఇప్పటికే ఈ వీడియో లక్షలాది మంది చూశారు. రకరకాల కామెంట్స్ వరదగా వెల్లువెత్తుతున్నాయి.

ఒక యూజర్ సరదాగా అడిగాడు, “మీరు తాజ్ హోటల్‌లో నివసిస్తున్నారా?” మరొక యూజర్, “అద్దెకు రూ. 1.25 లక్షలు. మేడమ్ అది టైపింగ్ తప్పునా?” అని అడిగాడు. మరొక యూజర్, “ఈ లేడీ నా మొత్తం సంవత్సరం జీతాన్ని కేవలం ఒక నెలలోనే వృధా చేస్తోంది” అని వ్యాఖ్యానించాడు. మరొక యూజర్ “పనిమనిషికి రూ. 45,000. చదువుకున్న వాళ్ళు కూడా అంత సంపాదించరు” అని రాశాడు.

ఖర్చులపై రష్యన్ మహిళ ఏమి చెప్పిందంటే

11 సంవత్సరాల క్రితం బెంగళూరుకు తను వచ్చినప్పుడు జీవనం చాలా చౌకగా ఉండేదని రష్యన్ మహిళ తన వీడియోలో వివరించింది. అప్పట్లో, HSR లేఅవుట్‌లో 2BHK ఫ్లాట్‌ను ₹25,000 కి అద్దెకు ఇచ్చేవారు. కానీ నేడు ముగ్గురు సభ్యులున్న కుటుంబం హాయిగా జీవించాలంటే కనీసం ₹250,000 అవసరం.

అయితే చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు యులియా జీవనశైలి భిన్నంగా ఉంటుందని.. అందువల్ల ఆమె ఖర్చులు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె తన పనిమనిషికి 45,000 రూపాయలు చెల్లించడం విషయం కొత్త చర్చకు దారితీసింది.

వీడియోను ఇక్కడ చూడండి

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా