AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కట్టేసిన గేదె వద్దకు వెళ్లి పడగవిప్పిన నాగుపాము.. ఆ తర్వాత

పాములు చాలా డేంజర్. ఒక్క కాటుతో ప్రాణాలు తీసేస్తాయి. మనుషులే కాదు.. అడవి జంతువులు అయినా పులులు, సింహాలు కూడా.. ప్రమాదకర పాముల జోలికి వెళ్లవు. అయితే తాజాగా ఓ పాము కట్టేసి ఉన్న గేదె వద్దకు వెళ్లి పడగ విప్పింది. ఆ తర్వాత...

Viral Video: కట్టేసిన గేదె వద్దకు వెళ్లి పడగవిప్పిన నాగుపాము.. ఆ తర్వాత
Buffalo Vs Snake
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2024 | 11:13 AM

Share

పాములు విషపూరిత జీవులు అన్న విషయం తెలిసిందే. ప్రాణాపాయం కలిగించే విషంతో కూడిన ఈ పాకే జీవులకు మనుషులే కాదు అడవి జంతువులు కూడా భయపడుతుంటాయి.  కొండచిలువ, నాగుపాము వంటి పాముల్ని చూసి అడవికి రారాజుగా పిలుచుకునే సింహం భయంతో రెండడుగులు వెనక్కి వేసిన దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా పాముకి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి బయటకు వస్తోంది. అందులో పాము, గేదెలు ఎదురుగా కనిపిస్తాయి. వీడియోలో తరువాత ఏమి జరిగిందో చూస్తే, నమ్మడం కష్టమే.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో @itz__akhil__5k అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు.  దీనిలో పాము, గేదె ముఖాముఖిగా వచ్చినప్పుడు, రెండింటి  ప్రవర్తనను మీరు గమనించవచ్చు. వీడియోలో ఎదురుగా ఉన్న పాము వద్దుకు వస్తుంది గేదె. అయితే గేదెను ప్రమాదంగా భావించి మరుసటి క్షణమే పాము దాని ముఖం మీద కాటువేస్తుంది. అయినప్పటికీ, గేదె చాలా ప్రేమగా పాము దగ్గరికి వెళ్లి లాలించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గేదె అదే పనిగా ఆ పామును నాకడం మీరు దిగువన వీడియోలో చూడవచ్చు.  గేదె ఇలా చేయడం చూసి పాము కూడా శాంతించి.. నిమ్మకుండిపోయింది.

ఈ షాకింగ్ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పామును అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేయకుండా.. వీడియో తీయడంపై భగ్గుమంటున్నారు. మరికొందరు ఆ గేదె క్షేమ సమాచారన్ని అడుగుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 26 మిలియన్ల మంది వ్యూస్, 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి