Viral video : నీదైర్యానికి దండం పెట్టాలి తల్లి.. చిరుతను ముద్దాడిన యువతి.. దాని రియాక్షన్ ఏంటంటే
కొండచిలువలను, రకరకాల పాములను, ఇంకొంతమంది క్రూరమృగాలు పెంచుకుంటూ ఉంటారు. ఏం చేసినా వన్యప్రాణులపై నమ్మకం పెట్టుకోలేము. అవి ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం.

పిల్లులు, కుక్కలను పెంపుడు జంతువుగా పెంచుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది వన్య ప్రాణులను పెంచుకుంటూ ఉంటారు. కొండచిలువలను, రకరకాల పాములను, ఇంకొంతమంది క్రూరమృగాలు పెంచుకుంటూ ఉంటారు. ఏం చేసినా వన్యప్రాణులపై నమ్మకం పెట్టుకోలేము. అవి ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం. అయితే వన్య ప్రాణులకు సంబంధించిన కొన్ని వీడియోలు చాలా క్యూట్ గా కూడా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ చిరుత పులి ఇక్కడ పిల్లిలా మారిపోయింది. ఏ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోలో లేడీ జాకెట్‌ని చూస్తే, ఆమె వైల్డ్ క్యాట్ కన్జర్వేషన్ సెంటర్‌లో మ్యూజియం కీపర్‌గా చేస్తుందనుకుంటా.. ఆమె అక్కడ ఉన్న చిరుత చెంపను ఒకసారి ముద్దుపెట్టుకుంది. అది వెంటనే ఆమె చెంపను నాకుతూ కనిపించింది.ఈ వీడియో చాలా క్యూట్ గా ఉంది. పిల్లులను సులభంగా మచ్చిక చేసుకోవచ్చు అవి కూడా అలానే చేస్తాయి. కానీ చిరుతపులి లాంటి భయంకరమైన జంతువును పెంపుడు జంతువుగా పెట్టుకోవడం ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే..క్షణాల్లో ఏదైనా జరగవచ్చు.




ఈ వీడియోను 2,25,000 మందికి పైగా లైక్ చేసారు. ఆమె ధైర్యానికి శభాష్ అంటున్నారు నెటిజన్లు. ధైర్యం ఉన్న చోట ప్రేమ ఉంటుందని కొందరు అంటారు. ప్రేమ ఉన్న చోట ప్రమాదానికి తెరలేపే స్వభావం కూడా ఉంటుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..




