Viral video: వెంట్రుకవాసిలో తప్పించుకోవడం అంటే ఇదే.. కదులుతున్న రైలు నుంచి పడిపోయిన యువతి..

తాజాగా ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది కదులుతోన్న రైలు, బస్సుల్లో నుంచి దిగడం ఎక్కడం లాంటివి చేస్తుంటారు.

Viral video: వెంట్రుకవాసిలో తప్పించుకోవడం అంటే ఇదే.. కదులుతున్న రైలు నుంచి పడిపోయిన యువతి..
Train
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 12, 2022 | 7:53 PM

ప్రతి క్షణం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు ఎప్పుడు ఎటు నుంచి వస్తాయో చెప్పలేం.. ఒకొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్న కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది కదులుతోన్న రైలు, బస్సుల్లో నుంచి దిగడం ఎక్కడం లాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ యువతీ కూడా అలానే చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

కదులుతున్న రైలు ఎక్కేందుకు వెళ్తున్న ఓ యువతి ప్లాట్ ఫాం అంచున పడిపోయింది. అక్కడే నిల్చున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ అప్రమత్తమై వెంటనే ఆమెను రక్షించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ వీడియో ఆర్పీఎఫ్ ఇండియా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఈ యువతి అదుపు తప్పిపోయింది. హెడ్ ​​కానిస్టేబుల్ వెంటనే ఆమె వద్దకు పరుగెత్తకపోతే, ఆమె ట్రైన్ కింద పడే అవకాశం ఉంది. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడింది. ‘హెడ్ కానిస్టేబుల్ సతీష్ చాలా త్వరగా ఆమెను రక్షించాడు. ‘రైలు చక్రాలు తగలకుండా కాపాడారు’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

ఈ ఘటన కేరళలోని తిరుర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 3,500 మందికి పైగా చూశారు. సహాయక చర్యలను పలువురు ప్రశంసించారు. “రైలు స్టేషన్‌లోకి ప్రవేశించినప్పుడు,దానికి దగ్గరగా నిలబడినప్పుడు RPF ప్రజలు ఎందుకు శ్రద్ధ వహిస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది” అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.