Air Conditioner: ఏసీ వాడేటప్పుడు ఈ శబ్దాలు వస్తున్నాయా..? మీరు జాగ్రత్త పడకపోతే డేంజర్..
ఇటీవల సమ్మర్ కారణంగా ఏసీలు వెడెక్కి కాలిపోతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు ఇలాంటప్పుడు ఎక్కువ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సమ్మర్‌లో ఏసీలు వాడే సమయంలో కొన్ని సూచనలు పాటించాలి. ఇవి పాటిస్తే మీ ఏసీ ఎక్కువకాలం పని చేయడంతో పాటు ఎలాంటి ప్రమాదాలు జరగవు.

ఏసీలు పేలిపోతున్న సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. వేడి వల్ల ఏసీలు పేలిపోతున్నాయి. సాధారణంగా షార్ట్ సర్క్యూట్, అధిక వేడి, వైరింగ్ సమస్యలు, గ్యాస్ లీకులు లేదా కంప్రెసర్‌పై అధిక ఒత్తిడి వంటి కారణాల వల్ల మంటలు చెలరేగుతున్నాయి. ప్రజలు తరచుగా దీనిని ‘ఏసీ బ్లాస్ట్’ అని పిలుస్తారు. అసలు ఏసీ బ్లాస్ట్ అంటే ఏంటి? ఏసీలు ఎందుకు బరస్ట్ అవుతున్నాయి? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఏసీ కాలిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం
వేడి పెరిగితే కాలిపోయే ప్రమాదం
దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటున్నాయి. దీని వల్ల ఏసీలు 12 నుండి 18 గంటల పాటు నిరంతరాయంగా నడుస్తున్నాయి. ఈ నిరంతర ఆపరేషన్ వల్ల కంప్రెసర్, కెపాసిటర్, మోటార్, విద్యుత్ భాగాలపై ఒత్తిడిని పెంచుతుంది. అంతేకాకుండా సకాలంలో సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది.
ఎయిర్ ఫిల్టర్‌లో దుమ్ము
ఇక ఏసీలు పేలిపోవడానికి ప్రధాన కారణం ఎయిర్ ఫిల్టర్, కాయిల్స్‌లో దుమ్ము పేరుకుపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఫిల్టర్లు మురికిగా ఉంటే గాలి ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల గది చల్లబరచడానికి మెషీన్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుంది.
రిఫ్రిజెరెంట్ గ్యాస్ లీకులు
ఇక ఆధునిక ఎయిర్ కండిషనర్లలో ఉపయోగించే కొన్ని వాయువులు కొద్దిగా మండే స్వభావం కలిగి ఉంటాయి. ఒకవేళ గ్యాస్ లీక్ అయి సమీపంలో నిప్పురవ్వలు ఎగిరితే అది అగ్నిప్రమాదానికి కారణం కావచ్చు. ఇక భారతదేశంలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు కూడా ఎక్కువగా ఉంటాయి. వేసవి కాలంలో కరెంట్ పోతూ వస్తూ ఉంటుంది. దీని వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల ఏసీలోని ఎలక్ట్రానిక్ భాగాలు, కంప్రెసర్లు దెబ్బతింటాయి. దీని వల్ల కూడా ఏసీ కాలిపోవచ్చు.
ప్రమాదం జరిగే ముందు..
ఇక ప్రమాదం జరిగే ముందు కొన్నిసార్లు సంకేతాల ద్వారా మీరు గుర్తు పట్టవచ్చు. ఏసీ నుండి కాలిపోతున్న వాసన రావడం, తరచుగా స్పార్కింగ్ రావడం, వైర్లు వేడెక్కడం, అసాధారణ శబ్దాలు రావడం, కూలింగ్ అకస్మాత్తుగా తగ్గిపోవడం లాంటివి చోటుచేసుకుంటే జాగ్రత్త పడండి.
