AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashoda First Day Collections: సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతున్న యశోద.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..

మెడికల్ మాఫియాను కొత్త కాన్సెప్ట్‏తో వచ్చిన యశోద ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంటున్న ఈ మూవీ మొదటి రోజు మంచి వసూళ్లే వచ్చాయి.

Yashoda First Day Collections: సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతున్న యశోద.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..
Yashoda
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2022 | 1:37 PM

Share

డైరెక్టర్స్ హరి, హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక శుక్రవారం ఉదయం నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా సామ్ నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో సామ్ ప్రాణం పెట్టి చేసిందని.. ఈ మూవీ కోసం ఆమె ఎంత కష్టపడిందో.. తెరపై కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెడికల్ మాఫియాను కొత్త కాన్సెప్ట్‏తో వచ్చిన యశోద ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంటున్న ఈ మూవీ మొదటి రోజు మంచి వసూళ్లే వచ్చాయి.

ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మెడికల్ థ్రిల్లర్ యశోద మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.25 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో .. నైజాంలో రూ. 84 లక్షలు.. సీడెడ్‏లో రూ. 18 లక్షలు.. ఆంధ్రాలో రూ. 63 లక్షలు వసూలు చేసింది. అలాగే తమిళనాడులో రూ. 14 లక్షలు.. మలయాళంలో రూ . 10 లక్షలు.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో కలిసి రూ. 20 లక్షల వసూళ్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‏లో రూ. 84 లక్షలు కలిపితే మొత్తం రూ. 3.25 కోట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత సామ్ నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుంది. ఇక తన సినిమాను సక్సెస్ చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది సామ్. ఇక ఈ సినిమా కాకుండా సామ్ నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది సామ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కరోనా చికత్సకు హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..?
కరోనా చికత్సకు హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..?
NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. లింక్ ఇదే
NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. లింక్ ఇదే
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌లోనే..
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌లోనే..