AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యాక్‌బుక్‌, ఐఫోన్‌.. టెక్నాలజీలోనూ ఫ్యాషన్ కోరుకుంటున్నారా?

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే వారు ధరించే దుస్తులు, వాడే టెక్నాలజీలో డైనమిక్ లుక్స్ ఉండాలని కోరుకుంటారు. దీనినే టెక్ బ్రో ట్రెండ్ అని పిలుస్తారు. అయితే ఇటీవల ఇందుకు భిన్నంగా మరో సరికొత్త ట్రెండ్ ముందుకు వచ్చింది. ఒకప్పటిలా నలుపు లేదా గ్రే రంగుల్లో సింపుల్‌గా, హుందాగా ఉండే కంప్యూటర్లను, ల్యాప్‌టాప్‌లను, ఫోన్లను నేటి యువత అంగీకరించడం లేదు.

మ్యాక్‌బుక్‌, ఐఫోన్‌.. టెక్నాలజీలోనూ ఫ్యాషన్ కోరుకుంటున్నారా?
Expressive Tech.jpg
Nikhil
|

Updated on: Jun 05, 2026 | 10:00 PM

Share

ఈతరం అమ్మాయిలు తమకు నచ్చిన స్టైల్‌ను అనుసరించడానికే మొగ్గు చూపుతున్నారు. సింపుల్ డిజైన్ల కంటే ఫ్యాషన్, ఫన్ ఉండే టెక్నాలజీని ఇష్టపడుతున్నారు. ప్లెయిన్ మ్యాక్‌బుక్, సాదా ఐఫోన్ కేస్ వంటి వాటిని కొత్త హంగులతో తీర్చిదిద్దుకుంటున్నారు. ఆధునిక యువత తాము వాడే టెక్నాలజీని సొంతంగా మార్చుకుంటూ, మరింత ఆకర్షణీయంగా రూపొందించుకుంటున్నారు.

ప్రస్తుతం తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కేవలం పనిముట్టులా మాత్రమే ఉండకూడదని యువత భావిస్తోంది. పింక్ ఐపాడ్స్, హై సాచురేషన్ గేమ్స్‌తో పెరిగిన ఆధునిక యువత తాము వాడే టెక్నాలజీని మరింత ఫన్, ఎక్స్‌ప్రెసివ్‌గా మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా సైబర్‌డెక్ అనే కస్టమ్-బిల్ట్ పోర్టబుల్ కంప్యూటర్లు పాపులర్ అవుతున్నాయి. ఇవి యూజర్ ఇంట్రెస్ట్, వర్క్‌ఫ్లో, ఇమాజినేషన్ ప్రకారం రూపొందించబడుతున్నాయి. టెక్నాలజీని సొంత ఆసక్తులకు అనుగుణంగా ఫ్యాషన్‌గా, సెల్ఫ్- ఎక్స్‌ప్రెషన్‌గా మార్చేయడంలో ఈ తరం యువత ముందున్నారు. అందుకోసం సైబర్‌డెక్‌లు టెక్ వేస్ట్‌ను రీయూజ్ చేసి, హ్యాండ్‌క్రాఫ్టెడ్‌గా అసెంబుల్ చేస్తున్నారు. ఇవి రెబెలియస్ స్టైల్‌ను ప్రతిబింబిస్తాయి.

వింటేజ్ టెక్నాలజీకి..

ఈ కొత్త ట్రెండ్ వింటేజ్ టెక్నాలజీని సరికొత్త రూపంలో వాడేందుకు ప్రేరేపిస్తోంది. ఫిఫ్త్ జనరేషన్ ఐపాడ్‌లు, పాతకాలపు ఫోన్‌లు, సింగిల్-పర్పస్ డివైజ్‌ల వాడకం కూడా పెరుగుతోంది. టెక్నాలజీని మళ్లీ ఆనందదాయకంగా, స్ట్రెస్‌లెస్‌గా ఉపయోగించుకోవాలన్నదే అసలు ఉద్దేశం. మినిమలిజం, నిరంతరం జరిగే డిజిటల్ నిఘా నుంచి దూరంగా, వ్యక్తిగత స్టైల్‌ను ఎక్స్‌ప్రెస్ చేసే ట్రెండ్‌గా ఇది మారుతోంది.

ఈ మూవ్‌మెంట్ టెక్నాలజీని కేవలం టూల్‌గా కాకుండా, కళ, హాబీ, సెల్ఫ్-ఎక్స్‌ప్రెషన్‌గా మారుస్తోంది. టెక్నాలజీ ఇక బోరింగ్ గాడ్జెట్ కాదు, యువత సృజనాత్మకతను చూపించే ఫన్ ఎలిమెంట్. గాడ్జెట్లను తమ వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా మలచుకోవడంలో యువత చూపిస్తున్న ఈ ఉత్సాహం నిజంగా అభినందనీయం. టెక్నాలజీతో ఆడుకోవడం ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారింది. ఈ సృజనాత్మక మార్పులు భవిష్యత్తులో టెక్నాలజీని మరింత రంగులమయంగా మార్చడం ఖాయం.

Follow Us