AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: సెన్సేషనల్‌ న్యూస్‌.. ప్రభాస్‌ సినిమాలో రామ్‌ గోపాల్‌ వర్మ.. ఇంతకీ ఏ పాత్రలో..

ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా భారీగా అంచనాలు ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా రేంజ్‌లో...

Prabhas: సెన్సేషనల్‌ న్యూస్‌.. ప్రభాస్‌ సినిమాలో రామ్‌ గోపాల్‌ వర్మ.. ఇంతకీ ఏ పాత్రలో..
Prabhas Rgv
Narender Vaitla
|

Updated on: Nov 12, 2022 | 2:57 PM

Share

ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా భారీగా అంచనాలు ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తుండగా, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రత్యేక అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వైరల్‌ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆర్జీవీని సంప్రదించగా దానికి దానికి వర్మ సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. త్వరలోనే వర్మకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తన దర్శకత్వ ప్రతిభతో యావత్‌ ఇండియాను ఆకట్టుకున్న రామ్‌గోపాల్‌ వర్మ తొలిసారి మరో చిత్రంలో నటుడిగా కనిపిస్తుండడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.

దీంతో ఈ విషయం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ నాగ అశ్విన్‌ రామ్‌గోపాల్‌ వర్మను ఎలా చూపించనున్నాడు, అతని ఎలాంటి రోల్‌ ఇవ్వనున్నాడన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కే చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సూపర్ హీరో ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 2024 వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మృత్యువుకు అడుగు దూరంలోకి వెళ్లి వచ్చిన మహిళ.. !
మృత్యువుకు అడుగు దూరంలోకి వెళ్లి వచ్చిన మహిళ.. !
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం
ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే