CM Revanth Reddy- YS Sharmila: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల.. కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానం
షర్మిల తన కుమారుడి పెళ్లి పత్రికను రేవంత్ రెడ్డికి అందించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియకు వివాహానికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని సీఎం రేవంత్ ను వైఎస్ షర్మిల కోరారు. అలాగే నిశ్చితార్థం కార్యక్రమానికి సైతం రావాలని షర్మిల ఆహ్వానించారు. దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కాబోయే వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆమె.. తన తనయుడు నిశ్చితార్థం, పెళ్లికి రావాలని రేవంత్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిలకు శాలువా కప్పి సత్కరించారు సీఎం. అనంతరం షర్మిల తన కుమారుడి పెళ్లి పత్రికను రేవంత్ రెడ్డికి అందించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియకు వివాహానికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని సీఎం రేవంత్ ను వైఎస్ షర్మిల కోరారు. అలాగే నిశ్చితార్థం కార్యక్రమానికి సైతం రావాలని షర్మిల ఆహ్వానించారు. దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కాబోయే వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 18వ తేదీన రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. దీంతో ప్రస్తుతం తనయుడి పెళ్లి పనుల్లో బిజిబిజీగా గడుపుతున్నారు షర్మిల. పలువురు ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ఇటీవల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత తాడే పల్లికి వెళ్లి తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల..
VIDEO | Congress leader YS Sharmila met Telangana CM @revanth_anumula in #Hyderabad, earlier today.
YS Sharmila, the daughter of former Andhra Pradesh CM Y S Rajasekhara Reddy and founder of YSR Telangana Party, joined the Congress in Delhi earlier this week.
(Source: Third… pic.twitter.com/CdUfjcvfY1
— Press Trust of India (@PTI_News) January 6, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…