Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: ప్రజా ఆరోగ్యం, ప్రజా రవాణాకు పెద్ద పీట.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

వాయు కాలుష్యం ఇదొక సైలెంట్ కిల్లర్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మరణాలకు దారి తీస్తుంది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత ఎక్కువవుతోంది. మరింత భయంకరమైన విషయం ఏమిటంటే, వాయు కాలుష్యం కేవలం శ్వాసకోశ సమస్యలకు కారణం కాదు. ఇది ఇతర వ్యాధులతో ముడిపడి ఉంది. వాటిలో కొన్ని ప్రాణాంతకమైనవి.

Revanth Reddy: ప్రజా ఆరోగ్యం, ప్రజా రవాణాకు పెద్ద పీట.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
CM Revanth Reddy
Follow us
TV9 Telugu

| Edited By: Basha Shek

Updated on: Jan 06, 2024 | 10:30 PM

వాయు కాలుష్యం ఇదొక సైలెంట్ కిల్లర్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మరణాలకు దారి తీస్తుంది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత ఎక్కువవుతోంది. మరింత భయంకరమైన విషయం ఏమిటంటే, వాయు కాలుష్యం కేవలం శ్వాసకోశ సమస్యలకు కారణం కాదు. ఇది ఇతర వ్యాధులతో ముడిపడి ఉంది. వాటిలో కొన్ని ప్రాణాంతకమైనవి. గుండె జబ్బుల నుండి క్యాన్సర్ వరకు, వాయు కాలుష్యం వల్ల కలిగే వ్యాధులు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ చుట్టూ నాలుగు వైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికి జవహర్ నగర్‌లో ఒకే ఒక డంప్ యార్డు దిక్కైంది. ప్రతిరోజు సుమారు 8 వేల టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు చేరవేస్తున్నారు.

డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, దుర్వాసన వంటి వాటితో చుట్టు ప్రక్కల వుండే జనానికి ఇబ్బందికరంగా మారింది. కాలుష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డులను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సైట్‌లను పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు గాను టిఎస్ఎస్పీడీసిఎల్ తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంతవరకు రీసైకిల్ చేయాలని అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలందిస్తామన్నారు.

మెట్రో రైల్

సీఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టతను ఇచ్చారు. గతంలో గచ్చిబౌలి – శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 32 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారు. దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదని భావించిన రాష్ట్ర సర్కార్.. గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ ప్రాంతాలను కలుపుతూ కొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ – ఫలక్‌నామా – ఏయిర్ పోర్టు రూట్, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్‌ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలు వున్నాయని అన్నారు ముఖ్యమంత్రి. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశాలకు అధికంగా వెళుతుంటారని, విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు ఎయిర్ పోర్టుకు వెళ్లి సెండాఫ్ ఇస్తుంటారని అందుకే ఈ రూట్ చాలా వినియోగకరంగా వుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

మూసీ నది పరీవాహక ప్రాంతం

మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని తొలి దశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ది చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రింగ్ రోడ్ టూ రింగ్ రోడ్ మొత్తం ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లలతో అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఎరియా, షాపింగ్ మాల్స్ లతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, గొల్కొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి వంటి వాటిని అనసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్‌ను రూపొందించాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పిపిపి మోడల్ లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేందుకు పరిశీలించాలన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో చెక్ డ్యాములను నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఫైవ్ స్టార్ హొటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…