Telangana: పాత పథకాలు రద్దు, కొత్త స్కీమ్‌లు వాయిదా..! పాలక, ప్రతిపక్షాల మధ్య ముదురుతున్న వార్..
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల కావొస్తున్న వేళ.. పాలక ప్రతిపక్షాల మధ్య పథకాల పంచాయితీ మొదలైంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ.. పోరాటానికి సిద్ధమవుతోంది BRS. అదే స్థాయిలో రివర్స్‌కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్..
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల కావొస్తున్న వేళ.. పాలక ప్రతిపక్షాల మధ్య పథకాల పంచాయితీ మొదలైంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ.. పోరాటానికి సిద్ధమవుతోంది BRS. అదే స్థాయిలో రివర్స్‌కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్.. గ్యారెంటీల అమలులో జాప్యం చేస్తోందంటూ ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్‌పై యుద్ధం ప్రకటించిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్… విమర్శల్లో ఘాటు పెంచింది. తాజాగా, హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దును చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ కేటీఆర్ ట్వీట్ చేయడం పొలిటికల్‌గా హీటు పెంచింది. ఈవీ పెట్టుబడుల ఆకర్షణకు.. గత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. నేటి ప్రభుత్వం తిరుగోమన దిశగా నిర్ణయం తీసుకుందని విమర్శించారు.
BRS ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు హరీశ్, కేటీఆర్. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఈ ఇద్దరునేతలు.. సంక్షేమ పథకాలను రద్దు చేస్తే ప్రజల తరపున పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలిచ్చిందంటూ ఇప్పటికే ఒక బుక్‌లెట్ కూడా రిలీజ్ చేసింది బీఆర్‌ఎస్. ప్రతిపక్ష పార్టీ తాజాగా నిరసన పిలుపుతో ఈ హీట్ మరింత పెరిగింది.
అయితే, బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలతో అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. తమ ప్రభుత్వానికి ఎప్పుడేం చేయాలో ప్రణాళిక ఉందనీ.. ఓర్వలేని తనంతోనే బీఆర్‌ఎస్ కక్షసాధిస్తోందనీ విమర్శించారు మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క. 6 గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం శ్రద్ధపెట్టిందనీ… 10 రోజుల కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదనీ చెప్పారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్‌ఎస్ చేసిన 420 ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
ఇప్పటికే మెట్రోవిస్తరణ, ఫార్మా సిటీ ప్రాజెక్టులు రీడిజైన్లు మారాయి. పలు భవనాల పేర్ల మార్పులు, పలు పథకాల వాయిదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి వేళ.. అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన వర్డ్ వార్.. ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..