యువకుడి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ పరుగు.. మీకు నిజంగా సెల్యూట్ బాస్
ఇంటిలో జరిగిన చిన్న గొడవ కారణంగా మనస్థాపానికి గురయ్యారు ఒక యువకుడు. దీంతో తన పొలంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆతనిని గమనించిన పోలీస్ కానిస్టేబుల్ భుజాలపై ఎత్తుకొని పొలాల గట్ల పై నుండి రెండు కిలోమీటర్ల మేర పరుగెత్తుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వెంటనే చికిత్స అందించడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగాడు కానిస్టేబుల్. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చోటు చేసుకుంది.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి 100 కు సమాచారం ఇవ్వడంతో బ్లూ కోట్స్ కానిస్టేబుల్ జైపాల్, హోమ్ గార్డ్ కిన్నెర సంపత్ సంఘటన స్థలానికి పది నిమిషాల్లో చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడాలనే తపనతో ఏమాత్రం ఆలోచించకుండా సురేష్‌ని కానిస్టేబుల్ జైపాల్ భుజాన ఎత్తుకొని పొలం గట్ల మధ్యనుండి సుమారు రెండు కిలోమీటర్ల మేర పరిగెత్తి గ్రామంలోకి తీసుకొచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆటోలో జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సురేష్‌ను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎంతో శ్రమపడి అపస్మారక స్థితికి వెళ్లిన సురేష్ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ జైపాల్‌ను, హోమ్ గార్డ్ సంపత్‌ను వీణవంక ఎస్ఐ వంశీకృష్ణతో పాటు గ్రామస్తులు అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..