TS DSC 2024 Notification: గుడ్‌న్యూస్.. తెలంగాణ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ వచ్చేసింది.. పోస్టుల వివరాలు ఇవే
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం (ఫిబ్రవరి 29) విడుదల చేశారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గానూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, ల్యాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఎదురు చూపుకు..
హైదరాబాద్, ఫిబ్రవరి 29: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం (ఫిబ్రవరి 29) విడుదల చేశారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గానూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, ల్యాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఎదురు చూపుకు ఎట్టకేలకు తెరపడినట్లైంది. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించిన నిరుద్యోగులు సర్కార్ కొలువు కోసం పుస్తకాలతో కుస్తాపడుతున్నారు.
పోస్టుల వివరాలు..
- స్కూల్ అసిస్టెంట్ పోస్టులు: 2, 629
- లాంగ్వేజ్ పండిట్ పోస్టులు: 727
- P.E.T పోస్టులు: 182
- ఎస్జీటీ పోస్టులు: 6,508
- స్కూల్ అసిస్టెంట్ (Special Education) పోస్టులు: 220
- ఎస్జీటీ (Special Education) పోస్టులు: 796
గత ఏడాది సెప్టెంబరు 6వ తేదీన 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులను పెంచి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పాత దరఖాస్తులు చెల్లుబాటులోనే ఉంటాయని, కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ, సిలబస్, అర్హతలు వంటి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి