Hyderabad: అలా చేస్తే అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్స్‌ నీళ్లు, కరెంట్‌ సప్లైయ్‌ డిస్‌కనెక్ట్‌ చేయొచ్చు: హైకోర్టు

తెలంగాణ అపార్ట్‌మెంట్స్ (ప్రొమోషన్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ప్రమోషన్) చట్టం, 1987 ప్రకారం అసోసియేషన్‌లకు ఇచ్చిన అధికారాన్ని తెలంగాణ హైకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 27) సమర్ధించింది. చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లకు నీరు, కరెంట్‌ వంటి నిత్యవసర సేవలను డిస్‌కనెక్ట్ చేసే అధికారాన్ని తీర్పు సందర్భంగా సమర్ధించింది. పట్టణ వనరులపై భారాన్ని తగ్గించే లక్ష్యంతో..

Hyderabad: అలా చేస్తే అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్స్‌ నీళ్లు, కరెంట్‌ సప్లైయ్‌ డిస్‌కనెక్ట్‌ చేయొచ్చు: హైకోర్టు
Telangana High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 29, 2024 | 8:42 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 29: తెలంగాణ అపార్ట్‌మెంట్స్ (ప్రొమోషన్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ప్రమోషన్) చట్టం, 1987 ప్రకారం అసోసియేషన్‌లకు ఇచ్చిన అధికారాన్ని తెలంగాణ హైకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 27) సమర్ధించింది. చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లకు నీరు, కరెంట్‌ వంటి నిత్యవసర సేవలను డిస్‌కనెక్ట్ చేసే అధికారాన్ని కోర్టు సమర్ధించింది. పట్టణ వనరులపై భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్‌వి శ్రవణ్ కుమార్ కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

నిత్యావసర సేవల సరఫరాను డిస్‌కనెక్ట్ చేయడానికి అసోసియేషన్ మేనేజ్‌మెంట్‌ను అనుమతించే చట్టంలోని సెక్షన్ 21 చెల్లుబాటును సవాలు చేస్తూ బొల్లాంట్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ బొల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఈ తీర్పు వెలువడింది. అపార్ట్‌మెంట్ అసోసియేషన్ వంటి ప్రైవేట్ సంస్థకు ఇటువంటి కఠినమైన శిక్షాచర్యలను చట్టం కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిత్యావసర సేవల సరఫరాను డిస్‌కనెక్ట్ చేయడం వంటి చర్యలు రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని, సహజ న్యాయ సూత్రాలను చట్టంలో చేర్చాలని పిటీషనర్‌ తరపు న్యాయవాది అరువ రఘురామ్ మహదేవ్ కోర్టును కోరారు. అసలు కేసు ఏంటంటే..

సోమాజిగూడలోని బాబుఖాన్‌ మిలీనియం సెంటర్‌ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో పిటిషనర్‌ శ్రీకాంత్‌ రెండు ఫ్లాట్‌లు తీసుకుని అందులో తన బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ను స్థాపించాడు. పార్కింగ్ స్థలం వంటి పలు విషయాలపై వివాదాలు తలెత్తడంతో అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌కు నిర్వహణ ఛార్జీలు చెల్లించడం మానేశాడు. దీంతో అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ నీళ్లు, కరెంట్ పరఫరాను నిలిపివేసింది. దీంతో శ్రీకాంత్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశాడు. పిటిషన్‌ను విచారించిన కోర్టు.. కోర్టు తలుపులు తట్టడానికి బదులుగా న్యాయబద్ధంగా ఛార్జీలు చెల్లించి ఉంటే బాగుండేదని బెంచ్ పేర్కొంది. డిఫాల్టర్లను ఎదుర్కోవడానికి అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌కు తగినంత అధికారాలు ఇవ్వకపోతే చట్టం దంతాలు లేని పులిగా మారుతుందని చట్టం ఉద్దేశాన్ని బలపరుస్తూ బెంచ్ పేర్కొంది. మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించకుండా ఉండేందుకు ఫ్లాట్ యజమానికి ఎలాంటి హక్కు లేదు. ప్రాథమిక హక్కులకు సహేతుకమైన పరిమితులు ఉన్నాయని బెంచ్‌ పేర్కొంది. అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్స్‌ భవనాల నిర్వహణకు నిధులు అవసరమని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని న్యాయపరమైన ఫ్రేమ్‌వర్క్‌లను సమీక్షించిన తర్వాత, ఏపీ లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మేరకు అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ చర్యను సమర్ధిస్తూ కోర్టు పిటీషన్‌ను కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.