AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎగ్జిబిషన్‌లో మహిళలతో భర్త వెకిలి చేష్టలు.. అందరి ఎదుటే బుద్ధి చెప్పిన భార్య

కొందరు ప్రభుద్దులు ఆడవాళ్లు కనిపిస్తే తమ పెళ్ళాం పిల్లల్ని కూడా పట్టించుకోకుండా పిచ్చి వేషాలు వేస్తారు.. అలా ఓ వ్యక్తి రద్దీగా ఉన్న ప్రాంతంలో వెకిలి చేష్టలు చేసి.. చివరికి భార్య చేతుల్లో చెంపదెబ్బలు తిన్నాడు. ఈ ఘటనకు వేదికగా మారింది హైదరాబాద్ లోని నుమాయిష్ ఎగ్జిబిషన్. నాంపల్లిలో దశాబ్దాల చరిత్ర కలిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్ ను చూసేందుకు జంట నగరాల్లోని ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Hyderabad: ఎగ్జిబిషన్‌లో మహిళలతో భర్త వెకిలి చేష్టలు.. అందరి ఎదుటే బుద్ధి చెప్పిన భార్య
Wife Slaps Husband
Surya Kala
|

Updated on: Feb 02, 2024 | 11:52 AM

Share

మాతృ దేవో భవ అంటూ స్త్రీకి తొలి పూజ్య స్థానం ఇచ్చిన సంస్కృతి సంప్రదాయం మనది. ఇంకా చెప్పాలంటే ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని చెబుతారు. అయితే ఇవన్నీ రోజు రోజుకీ నీటి మీద రాతల్లా మారిపోతున్నాయి. ఆడది అయితే చాలు.. నెలల చిన్నారి అయినా.. 60 ఏళ్ల ముదుసలి అయినా చాలు అనుకునే మృగాలు పెరిగిపోతున్నారు.. కొందరు ప్రభుద్దులు ఆడవాళ్లు కనిపిస్తే తమ పెళ్ళాం పిల్లల్ని కూడా పట్టించుకోకుండా పిచ్చి వేషాలు వేస్తారు.. అలా ఓ వ్యక్తి రద్దీగా ఉన్న ప్రాంతంలో వెకిలి చేష్టలు చేసి.. చివరికి భార్య చేతుల్లో చెంపదెబ్బలు తిన్నాడు. ఈ ఘటనకు వేదికగా మారింది హైదరాబాద్ లోని నుమాయిష్ ఎగ్జిబిషన్. వివరాల్లోకి వెళ్తే..

నాంపల్లిలో దశాబ్దాల చరిత్ర కలిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్ ను చూసేందుకు జంట నగరాల్లోని ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. 46 రోజులపాటు కొనసాగే నుమాయిష్‌లో సాయంత్రం అయితే చాలు రద్దీ నెలకొంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు సందర్శకుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మఫ్టీలో తిరుగుతున్నారు. ఎగ్జిబిషన్ కు వచ్చిన ఓ వ్యక్తి రద్దీగా ఉండడంతో ఇదే అదనుగా భావించి మహిళలను అసభ్యంగా తాకుతూ ఆనందం అనుభవించసాగాడు. ఈ విషయాన్నీ మఫ్టీలో ఉన్న పోలీసులు గమనించారు. అతడి చర్యలను సీక్రెట్ గా రికార్డ్  చేశారు.

అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని అతడి భార్యకు తెలియజేసి.. పోలీస్ స్టేషన్ కి పిలిచి చెప్పారు. రికార్డ్ చేసిన వీడియోను చూపించారు. భర్త చేసిన పనిని చూసిన భార్య భద్రకాళి అయింది. కోపంతో పోలీస్ స్టేషన్ లోనే అందరి ముందు భర్త చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..