హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా ఏపీ కానిస్టేబుల్స్.. అదుపులోకి తీసుకుని చెక్ చేయగా
వారిద్దరూ ఆంధ్రాలో కానిస్టేబుల్స్. న్యాయం వైపు నిలబడాల్సినవాళ్లు. అక్రమ మార్గాలను ఎంచుకున్నవారిని దండిచాల్సినవాళ్లు. కానీ వారే ట్రాక్ తప్పారు. అత్యాశకు పోయి.. తప్పుడు పని చేస్తూ తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ వారేం చేశారు.. ఎందుకు అరెస్టయ్యారు.. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

హైదరాబాద్, ఫిబ్రవరి 2: మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ ఇది. ఏకంగా పోలీసులే గంజాయి రవాణాకు పూనుకున్నారు. ఆరోగ్యం బాగా లేదని లీవ్ పెట్టి మరీ గంజాయి అక్రమ రవాణాకు యత్నించారు. అయితే తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఏపీకీ చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ గంజాయి స్మగ్లింగ్ దందా నడిపిస్తూ SOT పోలీసుల చేతికి చిక్కారు. శుక్రవారం తెల్లవారు జామున బాచుపల్లిలో కారులో గంజాయి తరలిస్తుండగా.. ముందుస్తు సమాచారంతో వారిని పట్టుకున్నారు. 22 కిలోల గంజాయిని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. వారు కాకినాడ మూడవ బెటాలియన్ ఏపీఎస్‌పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అని తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. అనారోగ్యం పేరుతో వారు డ్యూటీకి సెలవు పెట్టి.. ఈ పాడు పనికి పూనుకున్నట్లు తెలిపారు. అధిక డబ్బుకు ఆశపడి ఈ చెడు మార్గాన్ని ఎనుకున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.
– హైదరాబాద్: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు
– డ్రగ్స్‌తో పట్టుబడ్డ లావణ్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు మొత్తం లావణ్య చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె బ్యాక్‌గ్రౌండ్ తవ్వి తీస్తున్నారు పోలీసులు. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది లావణ్య. జల్సాలకు అలవాటుపడి టాలీవుడ్‌లో ఛాన్స్‌ల కోసం యత్నించింది. మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తూ చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. షార్ట్ ఫిలిమ్స్‌లో హీరోయిన్‌గా నటిస్తూ జల్సాలకు అలవాటు పడింది లావణ్య. ఒక హీరోకు పరిచయమై లవర్‌గా మారింది.
— వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అనుమానితురాలుగా ఉన్న లావణ్య.. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లావణ్య సోషల్ మీడియా అకౌంట్‌లతో పాటు వ్యక్తిగత చాట్ పరిశీలిస్తున్నారు. లావణ్యకు చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు అనుమతితో లావణ్యను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.
— మోకిలా డ్రగ్స్ కేసులోనూ నిందితురాలుగా ఉంది లావణ్య. కొంతమంది సింగర్లు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆమెకు కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కోకాపేటలో ఓ విల్లాలో నివాసం ఉంటోంది. గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోను నిందితురాలిగా ఉన్న లావణ్య పోలీసుల అరెస్ట్ నుంచి గతంలో తప్పించుకుంది. అప్పచి నుంచి లావణ్య కదలికలపై పోలీసుల ఫోకస్ పెట్టారు. ఆమె దగ్గర లభింటిన డ్రగ్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ తాను స్వీకరించేందుకు తీసుకుందా లేదా ఎవరికైనా అమ్మడానికా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు నార్సింగి పోలీసులు.
— లావణ్యతో పాటు ఉనీత్ రెడ్డి, ఇందిరాపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఉనీత్ రెడ్డి, ఇందిరా ఆ ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు కలిసి డ్రగ్స్ సేవించి, డ్రగ్స్ అమ్మేవారని అంటున్నారు పోలీసులు. ఒక్కో గ్రాం పౌడర్‌ను 6 వేల రూపాయలకు విక్రయిస్తుందని లావణ్య అండ్ బ్యాచ్. బెంగుళూరు నుంచి ఉనీత్ రెడ్డి ఒక్కో గ్రాము 1500 రూపాయలకు తీసుకొస్తుండగా.. ఇందిరా, లావణ్య ఇక్కడ విక్రయిస్తున్నారు. పరారీలో ఉన్న ఉనీత్ రెడ్డి, ఇందిరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. లావణ్య, ఉనీత్ రెడ్డి కలిసి షార్ట్ ఫిల్మ్‌లలో నటించారు. రాజ్ కిరణ్ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటుంది లావణ్య.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
