AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా విప్పుతున్న ఏసీబీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. బాలకృష్ణ ఇచ్చిన అనుమతులకు సంబంధించి దస్త్రాల వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈనెల 7వరకు అతని విచారణ కొనసాగనుంది. ఈ కేసులో లేటెస్ట్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

Hyderabad: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా విప్పుతున్న ఏసీబీ
Balakrishna
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2024 | 1:41 PM

Share

హైదరాబాద్, ఫిబ్రవరి 2:  HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా విప్పుతుంది ఏసీబీ. మూడో రోజు విచారణలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై 3 లాకర్‌లు గుర్తించారు. ఆ మూడు లాకర్‌లను ఇవాళ ఓపెన్ చేయనుంది ఏసీబీ. శివబాలకృష్ణ బినామీలకు 2 నెలల క్రితం హోండాసిటీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఏసీబీ లోతుగా విచారిస్తోంది.

వాస్తవానికి కస్టడీలో మొదటి రోజు ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ సహకరించలేదు. దీంతో తమ దగ్గర ఉన్న ఆధారాలను శివబాలకృష్ణ ముందు ఉంచి ప్రశ్నలవర్షం కురిపించింది ఏసీబీ. దీంతో రెండో రోజు శివబాలకృష్ణ నోరు విప్పాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు కొద్దికొద్దిగా సమాధానాలు చెబుతున్నాడు. శివబాలకృష్ణ బినామీలపై ఉన్న ఆస్తుల గురించి ఆరాతీస్తోంది ఏసీబీ. రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులతో పాటు బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు.

శివబాలకృష్ణకు చెందిన 8 బ్యాంకు లాకర్లు, ఆయన బినామీలు, పెట్టుబడులపై ఆరా తీస్తోంది ఏసీబీ. ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకి పర్మిషన్స్ వంటి వాటిపై ఆరా తీస్తోంది. శివబాలకృష్ణకు రెండు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సత్య & మూర్తితో ఉన్న లింక్స్ పై విచారిస్తోంది.

శివ బాలకృష్ణ అవినీతిలో మరో కోణంపై అధికారులు కూపీ లాగుతున్నారు. ఈయన అవినీతి వెనక IAS అధికారి పాత్ర ఉన్నట్లు ACB అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు దర్యాప్తు సంస్థ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు