Jubilee Hills Bypoll: నగరం నడిబొడ్డున పొలిటికల్ హీట్.. గెలిస్తే బలం.. ఓడితే సంకటం!
జూబ్లీహిల్స్‌లో గెలిచిన పార్టీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందా? వినడానికి కాస్త ఎబ్బెట్టుగా, పెద్ద స్టేట్‌మెంట్‌గా కనిపిస్తోంది గానీ.. అలా అనడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయ్. ఎవరు గెలిచినా సరే.. గెలిచిన పార్టీకి అటు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అడ్వాంటేజ్ దొరుకుతుంది. పట్టు సడలలేదు అని చెప్పుకోడానికి వీలుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలే కాదు అటుపైన జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్‌కు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే అన్ని పార్టీలకు ఒక గేట్‌వే అవుతుంది. ఇటు లోకల్‌లో, అటు గ్రేటర్‌లో జెండా ఎగరేస్తే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తాము ఫిట్‌గా ఉన్నామని చెప్పుకోడానికి వీలవుతుంది. అందుకే, రాష్ట్ర రాజకీయాలను శాసించే ఉప ఎన్నిక అనే టాక్ నడుస్తోంది.

జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌ను మినీ అసెంబ్లీ వార్‌గా ఎందుకు చూడకూడదు? ఈ ఎన్నికను ఒక రిఫరెండంగా ప్రభుత్వం తీసుకుంటోందో లేదో గానీ ప్రతిపక్షాలు మాత్రం రిఫరెండమే అంటున్నాయి. స్లమ్ ఏరియాల నుంచి సెలబ్రిటీలుండే హై క్లాస్ ఏరియాల దాకా.. మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, సెటిలర్స్ ఇలా అన్ని వర్గాల వాళ్లు ఉండే సెగ్మెంట్ జూబ్లీహిల్స్..! అదో మినీ కాస్మొపాలిటన్ కాన్‌స్టిట్యూషన్. పైగా ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు దాటింది. ఈ ఒక్క నియోజకవర్గంలో వచ్చే ఫలితం.. ప్రభుత్వ పాలనాతీరుకు ప్రజలు ఇచ్చే మార్కులుగా, ప్రతిపక్షాల పనితీరుపై ఓ ప్రజాభిప్రాయంగా ఎందుకు తీసుకోకూడదు? సో, ఒక నియోజకవర్గంలో జరిగే బై ఎలక్షన్‌గా చూడకూడదు దీన్ని. తెలంగాణ రాజకీయాలను ములుపుతిప్పే ఒక మినీవార్‌గా చూడొచ్చు. పార్టీలు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలవడానికి కావాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. ఇంతకీ… ఏంటా వ్యూహాలు? జూబ్లీహిల్స్‌లో గెలుపు పార్టీలకు ఎందుకంత ప్రతిష్టాత్మకం. తెలంగాణ రాజకీయాలను టర్న్ చేసే ఎన్నికగా జూబ్లీహిల్స్ వార్‌ను ఎందుకు చూస్తున్నారు..? గెలిచిన పార్టీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందా? జూబ్లీహిల్స్‌లో గెలిచిన పార్టీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందా? వినడానికి కాస్త ఎబ్బెట్టుగా, పెద్ద స్టేట్‌మెంట్‌గా కనిపిస్తోంది గానీ.. అలా అనడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఎవరు గెలిచినా సరే.. గెలిచిన పార్టీకి అటు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అడ్వాంటేజ్ దొరుకుతుంది. పట్టు సడలలేదు అని చెప్పుకోడానికి వీలుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలే కాదు అటుపైన జరిగే...




