Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నాడు బిఆర్ఎస్‎కు కంచుకోట ఈ జిల్లా.. నేడు అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం.. ఎందుకిలా..

పోరాటాల పురిటి గడ్డ.. అనేక ఉద్యమాలకు పురుడు పోసిన అడ్డ వరంగల్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన ఈ గడ్డ బీఆర్ఎస్ పార్టీకి ఆయుపట్టుగా నిలిచింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీకి అక్కడ గడ్డు పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లేరా.? లేక సమరానికి సై అంటున్న వారిలో సమర్థులు లేరా.?

Telangana: నాడు బిఆర్ఎస్‎కు కంచుకోట ఈ జిల్లా.. నేడు అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం.. ఎందుకిలా..
Brs Kcr
Follow us
G Peddeesh Kumar

| Edited By: Srikar T

Updated on: Apr 10, 2024 | 2:23 PM

పోరాటాల పురిటి గడ్డ.. అనేక ఉద్యమాలకు పురుడు పోసిన అడ్డ వరంగల్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన ఈ గడ్డ బీఆర్ఎస్ పార్టీకి ఆయుపట్టుగా నిలిచింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీకి అక్కడ గడ్డు పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లేరా.? లేక సమరానికి సై అంటున్న వారిలో సమర్థులు లేరా.? ఇంకేమైనా వ్యూహం ఉందా.? కారణాలు ఏమైనా అభ్యర్థి ప్రకటన విషయంలో కాలయాపన ఆశావాహుల్లో నిరుత్సాహం ఆవహించేలా చేస్తుంటే.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం సన్నగిల్లుతుంది.

ఈ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ హాట్ టాపిక్‎గా మారింది. రక్తి కట్టించే రాజకీయాలు. జంపింగ్ జిలానీలతో నిత్యం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గత నెల రోజుల నుండి వరంగల్ పార్లమెంట్‎లో జరుగుతున్న నాటకీయ పరిణామాలు చూస్తుంటే ఓరుగల్లు తెలుగు రాష్ట్రాల్లోనే చర్చగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేతలంతా తలోదారి పట్టారు. మొదట అంతా ఆరురి రమేష్‎కి బీఆర్ఎస్ టికెట్ కట్టబెడతారని భావించారు. కానీ ఆయన నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాషాయ గూటికి చేరారు. బిజెపి అధిష్టానం ఆయన్ను వరంగల్ పార్లమెంటు బిజెపి అభ్యర్థిగా రంగంలోకి దింపింది.

అనూహ్యంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరును ప్రకటించారు. కానీ కడియం కావ్య బీఆర్ఎస్‎కు ఊహించని షాక్ ఇచ్చింది. కాంగ్రెస్తో దోస్తీ కుదుర్చుకున్న కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆమెను వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దింపింది. ప్రస్తుతం కాంగ్రెస్ – బీజేపీ రెండు జాతీయ పార్టీలు బరిలోకి దింపిన అభ్యర్థులు బీఆర్ఎస్ వలస నేతలే. అసలు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. కడియం కావ్య ఇచ్చిన షాక్ నుండి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరూ .? ఎవరిని బరిలోకి దింపబోతున్నారు..? మహిళలను దింపుతారా లేక మగధీరున్ని రంగంలోకి దింపుతారా..? అనే చర్చ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

బలమైన అభ్యర్థులు లేకే ప్రకటన వాయిదా వేస్తున్నారా..? లేక పోటీకి సై అంటున్న వారిలో సమర్థులు లేక వేచి చూస్తున్నారా అనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ టిక్కెట్ రేసులో వరంగల్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, డాక్టర్ సుజాత, డాక్టర్ సుధీర్ కుమార్, జోరిక రమేష్ పరంజ్యోతి ఉన్నారు. సమరానికి సై అంటున్న ఈ ఆశావాహులు అంతా తమకు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్‎ను ఓడించి కడిగి పారేస్తాం అంటున్నారు. అయితే గులాబీ బాస్ మాత్రం మహిళా నేతనే బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. పెద్ది స్వప్న పేరు దాదాపుగా ఖరారు అయినట్లే అని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది.

అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతుండడంతో ఆశావాహుల్లో నిరుత్సాహం ఆవహిస్తుంది. కడియం పార్టీ మారిన తర్వాత నూతన ఉత్సాహంతో ఉన్న పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం సన్నగిల్లుతుంది. కరువు పరిస్థితులు బీఆర్ఎస్‎కు కలిసి వస్తాయని భావిస్తున్న నేతలపై నిరుత్సాహం ఆవహిస్తుంది. నిజంగా బలమైన అభ్యర్థి లేకే ప్రకటన వాయిదా వేస్తున్నారా.? లేక ఇంకా ఏదైనా కారణాలు, వ్యూహాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు రేపు అభ్యర్థి ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..