AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రాజన్న ఆలయ వసతి గృహంలో ప్రత్యక్షమైన నాగరాజు.. ఆ తర్వాత సీన్‌ ఇదే! వీడియో

భక్తులు..స్వామి వారి దర్శనం కోసం సిద్ధమవుతున్నారు. ఎవరి పనుల్లో.. వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలోనే.. అక్కడ ఓ పాము కనబడింది. దీంతో.. ఒక్కసారిగా భక్తులు పరుగులు తీశారు. వెంటనే పాములు పట్టే వ్యక్తి కి సమాచారం అందించడంతో అతడు అక్కడికి చేరుకుని, అతి కష్టం మీద పామును పట్టుకొని.. అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు...

Watch Video: రాజన్న ఆలయ వసతి గృహంలో ప్రత్యక్షమైన నాగరాజు.. ఆ తర్వాత సీన్‌ ఇదే! వీడియో
Cobra Snake Enconters In Vemulawada Rajanna Temple
G Sampath Kumar
| Edited By: Srilakshmi C|

Updated on: Nov 21, 2025 | 10:39 AM

Share

రాజన్న సిరిసిల్ల, నవంబర్‌ 21: భక్తులు..స్వామి వారి దర్శనం కోసం సిద్ధమవుతున్నారు. ఎవరి పనుల్లో.. వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలోనే.. అక్కడ ఓ పాము కనబడింది. దీంతో.. ఒక్కసారిగా భక్తులు పరుగులు తీశారు. వెంటనే పాములు పట్టే వ్యక్తి కి సమాచారం అందించడంతో అతడు అక్కడికి చేరుకుని, అతి కష్టం మీద పామును పట్టుకొని.. అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహమైన రూమ్ నెంబర్ 13ఏ పార్వతిపురంలో నాగు పాము ప్రత్యక్షమైంది. కొంత మంది భక్తులు అదే రూంలో బస ఉన్నారు. అందరూ దర్శనాల కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో.. పాము పడగ విప్పి బసలు కొడతూ అటు.. ఇటు తిగుతూ భయభ్రాంతులకు గురి చేసింది. ఇంతలో కొందరు భక్తులు ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న అటెండర్ పాములు పట్టే జగదీష్ కు సమాచారం అందించాడు. వెంటనే.. అక్కడికి చేరకున్న జగదీష్ చాకచక్యంగా ఎవరికి హాని కలగకుండా నాగుపామును పట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

దీంతో భక్తులతో పాటు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పాములు రాకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. అయితే ఆలయంలోకి ప్రవేశించిన ఈ పాము ఎలా వచ్చిందో తెలియ రాలేదు. ఏకంగా వసతి గృహంలోకి పాము రావడంతో భక్తులు భయపడుతున్నారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు పాము రావడం ఇదే మొదటిసారని వసతి గృహ సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పాములు లేవని, భక్తులు బయపడవద్దని స్థానిక సిబ్బంది చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.