AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: ఇక తెలంగాణ ప్రభుత్వం చేతికి మెట్రో.. డెడ్‌లైన్ ఇదే.. ఈ సారి..

ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. దీనికి సంబంధించి కీలక ముందడుగు పడింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టుకుంది. మెట్రో కోసం ఎల్‌అండ్‌టీ అప్పులు చేసింది. దీంతో మెట్రో నిర్వహణ ఆ సంస్థకు కష్టంగా మారింది.

Hyderabad Metro: ఇక తెలంగాణ ప్రభుత్వం చేతికి మెట్రో.. డెడ్‌లైన్ ఇదే.. ఈ సారి..
Hyderabad Metro
Venkatrao Lella
|

Updated on: Nov 21, 2025 | 11:13 AM

Share

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో నష్టాల ఊబిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. లాభాలు ఆశించినంత రాకపోవడంతో మెట్రో నిర్వహణ ఎల్‌అండ్‌టీ సంస్థకు కష్టమవుతుంది. దీంతో మెట్రోను ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆ సంస్థ గతకొంతకాలంగా రేవంత్ సర్కార్‌తో చర్చలు జరుపుతోంది. నష్టాలతో మెట్రో సేవలను నడపలేమని ప్రభుత్వానికి అభ్యర్థనలు పెట్టింది. దీంతో రేవంత్ ప్రభుత్వం కూడా మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాల్లో నిమగ్నమైంది. వచ్చే ఏడాది మార్చి31లోగా ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తి బాధ్యతలను తీసుకోవాలని తాజాగా నిర్ణయించింది.

ఈ ప్రక్రియ పూర్తైతే ఇక మెట్రో నిర్వహణ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. నష్టాల్లో ఉన్న మెట్రోను నడపడం ప్రభుత్వానికి కూడా తలకు మించిన భారమే. కానీ ప్రభుత్వానికి నడపక తప్పనిసరి పరిస్థితి. మెట్రో సేవలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ చేసి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపింది. 8 మార్గాల్లో మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ ఇప్పటివరకు ఇంకా అనుమతులు రాలేదు.అయితే తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్..పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చిలోపు హైదరాబాద్ మెట్రో విస్తరణ అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటనతో మార్చిలోపు హైదరాబాదాద్ మెట్రో విస్తరణకు అనమతులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో మెట్రో విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కేంద్రం నుంచి ఆర్ధిక సహాయం కోరుతుంది. కేంద్రం నుంచి అనుమతి వచ్చేలోపు ఎల్‌అంట్ టీ నుంచి టేకోవర్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో మార్చిలోపు పూర్తి చేయాలనే డెడ్‌లైన్ పెట్టుకుంది.

Follow Us