AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema Movie : ట్రెండింగ్‏లో తెలుగు హారర్ కామెడీ మూవీ.. ఓటీటీ రచ్చ చేస్తున్న లేటేస్ట్ సూపర్ హిట్.. మిలియన్ వ్యూస్..

థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన తెలుగు హారర్ సినిమా ఇప్పుడు, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 (నాన్-ఇంగ్లీష్) సినిమాల జాబితాలో 7వ స్థానంలో నిలిచి, కేవలం ఒక్క వారంలోనే 1.2 మిలియన్ల వ్యూస్ సాధించింది.

Rajitha Chanti
|

Updated on: May 10, 2026 | 9:45 PM

Share
థియేటర్లలో పెద్దగా సందడి చేయని కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక అనూహ్యమైన ఆదరణ పొందుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి చేరుతోంది తెలుగు హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం 'రాకాస'. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. చిన్న సినిమాగా విడుదలైన 'రాకాస', నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 (నాన్-ఇంగ్లీష్) కేటగిరీలో 7వ స్థానంలో నిలిచింది. కేవలం ఒక్క వారంలోనే ఈ సినిమా 1.2 మిలియన్ల వ్యూస్ (12 లక్షల వీక్షణలు) సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

1 / 5
ఒక చిన్న తెలుగు సినిమా ఈ స్థాయిలో అంతర్జాతీయ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం హారర్ మాత్రమే కాకుండా కామెడీ , ఫాంటసీ అంశాల కలయికతో రూపొందింది. చనిపోయిన తర్వాత కూడా కొన్ని కోరికలు తీరక తిరుగుతున్న ఆత్మలకు, హీరో ఎలా సహాయం చేశాడు? ఆ క్రమంలో ఎదురైన వింత పరిణామాలు ఏమిటి? అనే అంశాలను దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. హారర్ చిత్రాలను ఇష్టపడే వారితో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఈ చిత్రం మెప్పిస్తోంది.

2 / 5
 పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినప్పటికీ, బలమైన కంటెంట్ , వినోదం ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'రాకాస' మరోసారి నిరూపించింది. థియేటర్లలో ఈ సినిమా గురించి పెద్దగా తెలియని వారు కూడా ఇప్పుడు ఓటీటీలో చూసి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇతర ప్రాంతాల ప్రేక్షకులు కూడా సబ్‌టైటిల్స్ సాయంతో ఈ సినిమాను వీక్షిస్తుండటంతో వ్యూస్ భారీగా పెరుగుతున్నాయి. రాకాస (2026) అనేది హారర్ , కామెడీ అంశాలతో కూడిన సోషియో-ఫాంటసీ చిత్రం. ఈ సినిమా 2026 ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలయ్యింది.

3 / 5
సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిహారిక కొణిదెల (పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్), ఉమేష్ కుమార్ బన్సాల్ (జీ స్టూడియోస్) నిర్మించారు. ఈ సినిమా చిన్నప్పుడు మనం విన్న చందమామ కథలు, బకాసురుడి కథల స్ఫూర్తితో రూపొందింది. అమెరికా నుండి తన సొంత గ్రామానికి తిరిగి వచ్చిన వీరబాబు (సంగీత్ శోభన్), ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ కోటలోని 'బ్రహ్మరాక్షసుడి' మిస్టరీని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా కథ.ఆ ఊరి ఆచారం ప్రకారం, ఆ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సి ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఆ కోటలోకి వెళ్లాల్సి వచ్చిన హీరో, అక్కడ ఎదురైన భయానక మరియు హాస్యభరిత సన్నివేశాలను ఎలా దాటాడనేది వినోదాత్మకంగా చూపించారు.

4 / 5
సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, వెన్నెల కిశోర్ , గెటప్ శ్రీనుల హాస్యం సెకండాఫ్‌లో సినిమాను నిలబెట్టాయి. హారర్ కంటే కామెడీకే దర్శకురాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.  సినిమా మొదటి భాగం (ఫస్టాఫ్) కొంచెం నెమ్మదిగా సాగుతుందని, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆకట్టుకుంది.  ఈ సినిమా 2026 మే 1 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా సుమారు ₹11 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఇది తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

5 / 5
Follow Us