Intelligence Bureau Jobs 2025: పదో తరగతి పాసైన వారికి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. రేపట్నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు
ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau).. దేశ వ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన..

కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau).. దేశ వ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు ఇలా..
- హైదరాబాద్‌లో పోస్టుల సంఖ్య: 06
- విజయవాడలో పోస్టుల సంఖ్య: 03
- అహ్మదాబాద్‌లో పోస్టుల సంఖ్య: 04
- ఐజ్వాల్‌లో పోస్టుల సంఖ్య: 11
- అమృత్‌సర్‌లో పోస్టుల సంఖ్య: 07
- బెంగళూరులో పోస్టుల సంఖ్య: 04
- భోపాల్‌లో పోస్టుల సంఖ్య: 11
- భువనేశ్వర్‌లో పోస్టుల సంఖ్య: 07
- చండీఘర్‌లో పోస్టుల సంఖ్య: 07
- చెన్నైలో పోస్టుల సంఖ్య: 10
- డెహ్రాదూన్‌లో పోస్టుల సంఖ్య: 08
- ఢిల్లీలో పోస్టుల సంఖ్య: 108
- గ్యాంగ్‌టక్‌లో పోస్టుల సంఖ్య: 08
- గువహటిలో పోస్టుల సంఖ్య: 10
- ఇటానగర్‌లో పోస్టుల సంఖ్య: 25
- జమ్మూలో పోస్టుల సంఖ్య: 07
- కాళిపంగ్‌లో పోస్టుల సంఖ్య: 03
- కోహిమాలో పోస్టుల సంఖ్య: 06
- కోల్‌కతాలో పోస్టుల సంఖ్య: 01
- లేహ్‌లో పోస్టుల సంఖ్య: 10
- లక్నోలో పోస్టుల సంఖ్య: 12
- మీరట్‌లో పోస్టుల సంఖ్య: 02
- నాగ్‌పుర్‌లో పోస్టుల సంఖ్య: 02
- పనాజిలో పోస్టుల సంఖ్య: 02
- పట్నాలో పోస్టుల సంఖ్య: 06
- రాయ్‌పుర్‌లో పోస్టుల సంఖ్య: 04
- రాంచీలో పోస్టుల సంఖ్య: 02
- షిల్లాంగ్‌లో పోస్టుల సంఖ్య: 07
- సిమ్లాలో పోస్టుల సంఖ్య: 05
- సిలిగురిలో పోస్టుల సంఖ్య: 06
- శ్రీనగర్‌లో పోస్టుల సంఖ్య: 14
- త్రివేండ్రంలో పోస్టుల సంఖ్య: 13
- వారణాసిలో పోస్టుల సంఖ్య: 03
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి తప్పనిసరిగా 2025 డిసెంబర్ 14వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 22, 2025వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 14, 2025వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్ , ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.650 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.
నోటిపికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








