ఒక్క సినిమాతో సెన్సేషన్.. చిరంజీవితో ఛాన్స్ మిస్సైన హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
03 June 2026
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం వస్తే చాలు, తెరపై ఒక్క క్షణమైనా కనిపించాలని ఎంతోమంది నటీనటులు ఆరాటపడుతుంటారు.
అలాంటిది ఒక క్రేజీ ముద్దుగుమ్మకు మెగాస్టార్ సినిమాలో నటించే అద్భుతమైన అవకాశం వచ్చినా.. అనుకోని కారణాలతో ఈ అమ్మడు క్రేజీ ఛాన్స్ మిస్సైందని టాక్.
ఆ బ్యూటీ మరెవరో కాదు.. 'వీరసింహారెడ్డి' చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మలయాళ కుట్టి హనీ రోజ్. ఒక్క సినిమాతోనే తెలుగులో సెన్సేషన్ అయ్యింది.
హనీ రోజ్ గతంలోనే తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ, 2023లో నందమూరి బాలకృష్ణ సరసన నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.
ఈ సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుందామె. ఆ సినిమా సక్సెస్ తర్వాత హనీ రోజ్‌కు టాలీవుడ్‌లో ఊహించని ఫాలోయింగ్ వచ్చింది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఒక ప్రతిష్టాత్మక చిత్రంలో హనీ రోజ్‌కు ఒక కీలక పాత్ర కోసం ఆఫర్ వచ్చిందట. ఈ గోల్డెన్ ఛాన్స్ రాగానే ఆమె ఎంతో ఎగ్జైట్ అయ్యిందని టాక్.
అయితే ఏమైందో ఏమో కానీ, అంతలోనే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, తెలుగులో వచ్చిన మరో క్రేజీ ఛాన్స్ మిస్సైందని టాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే తప్పుకుందని ప్రచారం నడుస్తుంది. మెగాస్టార్‌తో నటించే ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.