AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mancherial: మానవత్వం మరిచిన‌ మనుషులు.. కన్నీళ్లు పెట్టుకున్న ఆవులు.. గుండెలు పిండేసే మూగరోధన

Mancherial: పారిశుద్ధ్య కార్మికులు.. చనిపోయిన‌ ఆవును అక్కడి‌ నుండి తరలించారు.. కానీ తీవ్రగాయాలతో పడి ఉన్న మరో ఆవును మాత్రం ముట్టుకోలేదు. ఆ వైపు నుండి వెళుతున్న ఓ యువకుడు స్పందించి ఆవును కాపాడేందుకు ప్రయత్నం చేసి విఫలమై.. టోల్​ ఫ్రీ నంబర్​ 1962కు ఫోన్​ చేసినా ఫలితం లేకుండా పోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. చివరికి పది గంటల తర్వాత తేరుకున్న అదికారులు ఆ ఆవును అక్కడి నుండి పశువైద్యశాల కు తరలించారు.

Naresh Gollana
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 10, 2023 | 12:21 PM

Share

మంచిర్యాల, సెప్టెంబర్10: మనిషిలో మానవత్వం రోజు రోజుకు చచ్చిపోతోంది. తోటీ మనిషికి ఏదైనా ప్రమాదం తలెత్తినా.. కళ్ల ముందే కొన ఊపిరితో కొట్టుకుంటున్నా ప్రాణాలు కాపాడుదామనే ఆలోచన ఒక్కరంటే ఒక్కరు‌కూడా చేయడం లేదు. అయ్యో‌పాపం అంటూ ఆగకుండా వెళ్లిపోవడం తప్ప.. ఒక్క నిమిషం ఆలోచించి ప్రాణాలు కాపాడుదామన్న ఆలోచనే చేయడం లేదు ఎవ్వరు. ఈ మద్య ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే కనిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై విలవిలలాడుతున్న వ్యక్తులను కాపాడేందుకు సరైన సమయంలో స్పందించకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారు. మేము మాత్రం అలా కాదు.. మాకు మానవత్వం అంటే ఏంటో తెలియక పోయిన తోటీ స్నేహితుల మీద ప్రేమ ఉందని చాటుతున్నాయి ఆ పశువులు. మూగ జీవాలే అయిన మనుషుల కంటే వేయి రెట్లు మేలని చాటుతున్నాయి. అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ ఘటన.

మంచిర్యాల జిల్లా మందమర్రి లో గుర్తు తెలియని వాహనం ఢీకొని శనివారం తెల్లవారు జామున రెండు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. రహదారి పక్కనే పడిపోయి నరకయాతన అనుభవించాయి. దాదాపు‌ నాలుగు గంటల పాటు విలవిలాడి ఆ రెండు ఆవుల్లో ఒక ఆవు మృతి‌ చెందింది. మరో ఆవు రెండు కాళ్లు విరిగి పోవడంతో తీవ్రగాయాలతో అంబా అంబా అంటూ ఎటు కదలలేని పరిస్థితుల్లో అక్కడే తండ్లాడింది. ఆ వైపు నుండి వెళ్లిన ఏ ఒక్కరు కూడా ఆగి అయ్యో‌పాపం అనడం కాదు కదా కనీసం మానవత్వం తో స్పందించలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఆవును బతికిద్దాం అని ముందుకు రాలేదు. చివరికి ఆ మూగ జీవి రోదనను అర్థం చేసుకున్న తోటి పశువులు ఇదిగో‌ ఇలా చుట్టు చేరి కన్నీళ్లు కార్చాయి. మనుషులు మా ఆవును జరంత ఆదుకోడంటూ మౌనంగానే రోదించాయి. నాలుగు‌ గంటల అనంతరం ఘటన స్థలానికి‌ చేరుకున్న పారిశుద్ధ్య కార్మికులు.. చనిపోయిన‌ ఆవును అక్కడి‌ నుండి తరలించారు.. కానీ తీవ్రగాయాలతో పడి ఉన్న మరో ఆవును మాత్రం ముట్టుకోలేదు. ఆ వైపు నుండి వెళుతున్న ఓ యువకుడు స్పందించి ఆవును కాపాడేందుకు ప్రయత్నం చేసి విఫలమై.. టోల్​ ఫ్రీ నంబర్​ 1962కు ఫోన్​ చేసినా ఫలితం లేకుండా పోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. చివరికి పది గంటల తర్వాత తేరుకున్న అదికారులు ఆ ఆవును అక్కడి నుండి పశువైద్యశాల కు తరలించారు. ప్రస్తుతం ఆ ఆవు పరిస్థితి మెరుగుపడుతున్నట్టు సమాచారం.

గుర్తు‌ తెలియని వాహనం‌ ఢీకొట్టడంతో రెండు ఆవులు తీవ్రంగా గాయపడగా.. ఈ ఘటన లో ఒక‌ ఆవు మృత్యవాత పడగా.. మరో ఆవు రెండు కాళ్లు విరిగి అచేతనంగా పడిపోయిన ఘటన ఇది. ఆ ఆవు వద్దకు చేరుకున్న గోవుల గుంపు.. ఆ ఆవును చూసి కన్నీళ్లు పెట్టుకున్నాయే తప్ప ఏ ఒక్క వ్యక్తి కనీస ధర్మాన్ని పాటించలేదు. ఆవులన్నీ కలిసి అంబా అంబా అని అరుస్తూ ఆవేదనను వ్యక్తం చేసిన… ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియా లో ఫోస్ట్ చేయడం తో ఈ విషయం వైరల్ గా మారింది. కొందరైతే రోడ్డు‌పై పశువులను వదిలిన యజమానులు తిట్టుకున్నారే తప్ప జాలి చూపలేదు. రోడ్లపై పశువుల వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో తెలసు.. మనుషుల ప్రాణాలు పోతే ఎవరు సమధానం చెప్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు‌ కూడా. ఏదేమైనా పశువుల ప్రాణాలైన మనుషుల ప్రాణాలైన కాపాడాల్సిన అవకాశం ఉండి సమయానికి స్పందించకపోతే ఆ ప్రాణం గాల్లో కలవాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..