Telangana: నైపుణ్యం చాటిన సిరిసిల్ల నేతన్న.. చేనేత మగ్గంపై అగ్ర నాయకుల చిత్రాలు.. స్వాగతం పలుకుతున్న ప్రధాని
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన హరి ప్రసాద్ చేనేత రంగంలో ఎంతో నైపుణ్యం సాధించాడు. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. తాజాగా.. మర మగ్గం పై G20 దేశాధి నేతల చిత్రాలను రూపొందించారు. రెండు మీటర్ల వస్త్రంలో ఇరు ప్రక్కల జి 20 లోగో వచ్చే విధంగా తయారు చేశాడు. వారం రోజులు పాటు శ్రమించి దీన్ని పూర్తి చేశాడు.
భారత్ లో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా ప్రపంచలో 20 అగ్రదేశాల అధ్యక్షులు మన దేశానికి వచ్చిన సందర్భంగా తెలంగాణకు చెందిన ఓ చేనేత కార్మికుడు తన నైపుణ్యాన్ని చాటాడు. G 20 దేశాల అధ్యక్షుల ఫోటోలతో పాటు భారతదేశం మ్యాప్.. అందులో మూడు రంగుల జాతీయ జెండా.. ఆ మధ్యలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ నమస్తే పెడుతూ స్వాగతం పలుకుతున్న చిత్రాన్ని తయారు చేశారు సిరిసిల్ల నేతన్న.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన హరి ప్రసాద్ చేనేత రంగంలో ఎంతో నైపుణ్యం సాధించాడు. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. తాజాగా.. మర మగ్గం పై G20 దేశాధి నేతల చిత్రాలను రూపొందించారు. రెండు మీటర్ల వస్త్రంలో ఇరు ప్రక్కల జి 20 లోగో వచ్చే విధంగా తయారు చేశాడు. వారం రోజులు పాటు శ్రమించి దీన్ని పూర్తి చేశాడు. ఈ వస్త్రంపై దేశాధి నేతల ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. పూర్తిగా మర మగ్గంపై చేతితో ఈ వస్త్రాన్ని తయారు చేశాడు.
గతంలో జి20 లోగో నేసి ప్రధానమంత్రి మోడీకి హరి ప్రసాద్ పంపించాడు. ఇప్పుడు జి20 దేశాల అగ్ర నాయకుల ఫోటోలు వచ్చేలా వస్త్రం తయారు చేశాడు. గతం లో మన్ కీ బాత్ ప్రోగ్రాం లో జి 20 లోగో గురించి మోడీ ప్రస్తావించారు కూడా.. గతంలో కూడా ఎన్నో ఆవిష్కరణలు చేసానని ప్రభుత్వం ద్వారా సహాయక సహకారాలు అందిస్తే మరిన్ని అద్భుతాలను చేసి తెలంగాణ కీర్తి ప్రపంచ వ్యాప్తంగా నిలుపుతానని హరి ప్రసాద్ అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..