Puttapaka Telia Rumal: పుట్టపాక తేలియా రుమాలకు అరుదైన గౌరవం.. జి-20 సదస్సులో పాల్గొన్న విదేశాల నేతలకు బహుమతి..
చేనేత కళాకారుల నైపుణ్యానికి.. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లా. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో వెయ్యి కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడి కళాకారులు నేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తళుకులీనుతున్నాయి. దుబీయన్ వస్త్రం డిజైన్ పుట్టపాక చేనేత కళాకారుల సొంతం. దుబీయన్ వస్త్రంతో తయారయ్యే తేలియా రుమాలుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.

ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన పుట్టపాక తేలియా రుమాలును మరో మరో ప్రపంచం ఘనంగా కీర్తించనుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ-20 సదస్సులో భారతీయ హస్తకళలు కొలువుదీరాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, హస్తకళల ప్రదర్శనలో భాగంగా తెలంగాణాలోని ఉమ్మడి నల్గొండ పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన తేలియా రుమాలును ప్రదర్శిస్తున్నారు. మండే వేసవిలోనూ చల్లగా ఉండి, చలి కాలంలో వెచ్చగా ఉండి.. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ తేలియా రుమాళ్లను జీ-20 సదస్సుకు వచ్చిన వివిధ దేశాధినేతలకు కేంద్రం బహూకరించనుంది. ఈ తేలియా రుమాల్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం…
చేనేత కళాకారుల నైపుణ్యానికి.. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లా. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో వెయ్యి కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడి కళాకారులు నేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తళుకులీనుతున్నాయి. దుబీయన్ వస్త్రం డిజైన్ పుట్టపాక చేనేత కళాకారుల సొంతం. దుబీయన్ వస్త్రంతో తయారయ్యే తేలియా రుమాలుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ వస్త్రాలు ఫ్యాషన్ ప్రియులు, డిజైనర్లను ఆకట్టుకుంటాయి. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే రంగులను తేలియా రుమాలు తయారీలో వినియోగిస్తారు.
పటిక, కరక్కాయ, హీరాకాసుతో ఎరుపు, నీలం, పసుపు మొదలైన రంగులను చెట్ల నుంచి సహజంగా రంగులను తయారు చేస్తారు. 20 రోజుల పాటు చేనేత కార్మికులు శ్రమించి రంగులు, నూలుతో మగ్గంపై నేస్తారు. నూనెలు, సహజసిద్ధ రంగులను ఉపయోగించి నేయడం వలన తేలియా రుమాల్లో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీంతో మండుటెండల్లో సైతం చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. ఉష్ణోగ్రత అధికంగా ఉండే గల్ఫ్ ప్రాంతవాసులు ప్రత్యేకంగా తేలియా రుమాలును కొనుగోలు చేస్తుంటారు. పుట్టపాక తేలియా రుమాలు ముంబాయి, జర్మనీ, జపాన్, సింగపూర్, అమెరికా, నెదర్లాండ్, గుజరాత్, చెన్నై, సోలాపూర్, కోల్‌కతా, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న పుట్టపాక తేలియా రుమాల్‌కు 2020లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ లభించింది
ఇటీవల భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ దేశ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడి భార్య బ్రిగిట్టేకు పోచంపల్లి చీరతోపాటు పుట్టపాక చేనేత కళాకారుల తయారు చేసిన దుబీయన్ తేలియా రుమాలును కూడా చందనం పెట్టెలో బహూకరించారు. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న జి -20 సదస్సుకు హాజరైన వివిధ దేశాల నేతలకు ప్రధాని మోదీ పుట్టపాక తేలియా రుమాళ్లను బహుకరించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




