Rama Mandir: రామ మందిర ప్రారంభోత్సవ తేదీ ప్రకటన! గర్భగుడిలో రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజలు ఎప్పుడు చేస్తారంటే
రామాలయ ప్రారంభోత్సవానికి వారం రోజుల ముందే ప్రాణ ప్రతిష్ఠ పూజలు ప్రారంభిస్తారని సమాచారం. సన్నాహాలకు సంబంధించి ఇటీవల సీఎం యోగి, ప్రధాని మోడీ మధ్య సమావేశం కూడా జరిగింది. ఇందుకు సంబంధించి ఢిల్లీలో ప్రధాని మోడీకి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో రామ మందిర మ్యూజియంతో సహా అయోధ్య అభివృద్ధి సహా అనేక విషయాలను చర్చించారు.
ఉత్తరప్రదేశ్ రామ జన్మ భూమి అయోధ్యలో నిర్మించిన ఈ రామాలయంలో జనవరి 22 న రామాలయాన్ని ప్రారంభించనున్నారు. గర్భగుడిలో రామయ్యను ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు అయోధ్యలో జరుగుతున్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ రామాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆహ్వానాలు పంపబడ్డాయి.
రామాలయ ప్రారంభోత్సవానికి వారం రోజుల ముందే ప్రాణ ప్రతిష్ఠ పూజలు ప్రారంభిస్తారని సమాచారం. సన్నాహాలకు సంబంధించి ఇటీవల సీఎం యోగి, ప్రధాని మోడీ మధ్య సమావేశం కూడా జరిగింది. ఇందుకు సంబంధించి ఢిల్లీలో ప్రధాని మోడీకి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో రామ మందిర మ్యూజియంతో సహా అయోధ్య అభివృద్ధి సహా అనేక విషయాలను చర్చించారు. ఈ ఏడాది డిసెంబర్ లో రామమందిర నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు.
ఈ సమావేశంలో రామమందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పాల్గొన్నారు. రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి రెండు రోజుల నుంచి భవన నిర్మాణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రామమందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు అలోక్ కుమార్, ఉపాధ్యక్షుడు జీవేశ్వర్ మిశ్రా పాల్గొన్నారు.
ఇటీవల శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం రామ మందిరం మొదటి అంతస్తు చిత్రాలను షేర్ చేసింది. అంతకుముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 19 న అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పరిశీలించారు. రాంలాలాకు కూడా పూజలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 5, 2020న రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేశారు.
నవంబర్ 9, 2019న రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా నిర్ణయం
ఫిబ్రవరి 2020లో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అంతకుముందు నవంబర్ 9, 2019న, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం రామ్ లల్లాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం వివాదాస్పద భూమిని ప్రభుత్వమే నిర్మించాలని పేర్కొంది. ఆ స్థలంలో రామమందిర నిర్మాణాన్ని పర్యవేక్షించే ట్రస్టుకు భూమిని అప్పగిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..