Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold and Silver Price Today: మహిళలకు గుడ్ న్యూస్ కొంతమేర దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఉన్నాయంటే..

గత కొంత కాలంగా ముదుపరులు బంగారాన్ని పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. దీంతో బంగారం ధర రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. ఒకానొక సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ స్టేజ్ కు చేరుకుంది. అప్పటి నుంచి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారణాలతో ప్రపంచంలో బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. 

Gold and Silver Price Today: మహిళలకు గుడ్ న్యూస్ కొంతమేర దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఉన్నాయంటే..
Gold Price Today
Follow us
Surya Kala

|

Updated on: Sep 10, 2023 | 7:10 AM

భారతీయులకు బంగారం ఒక స్టేటస్ సింబల్ మాత్రమే కాదు.. ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు ఏర్పడి.. డబ్బులకు ఇబ్బంది కలిగితే.. తమను బంగారం ఆదుకుంటుందని భావిస్తారు. అదే సమయంలో గత కొంత కాలంగా ముదుపరులు బంగారాన్ని పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. దీంతో బంగారం ధర రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. ఒకానొక సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ స్టేజ్ కు చేరుకుంది. అప్పటి నుంచి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారణాలతో ప్రపంచంలో బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా.. ఎప్పుడు నగలు కొనుగోలు చేద్దామని ఆసక్తిగా మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో ఆదివారం సెప్టెంబర్ 10వ తేదీన బంగారం ధర ఏ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో పసిడి ధర

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న శనివారం రూ. 5,500లు ఉండగా ఈ రోజు రూ. 15 లు తగ్గి.. ఈ రోజు అంటే ఆదివారం ఒక గ్రాము బంగారం ధర  రూ. 5,485లకు చేరుకుంది.

22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల పసిడి ధర శనివారం రూ. 55,000లు ఉండగా ఆదివారం ఉదయానికి రూ. 150 లు తగ్గి రూ. 54,850లుగా కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ గ్రాము ధర నిన్న (శనివారం ) రూ.6 వేలు ఉంది. రూ. 16 మేర తగ్గి ఈ రోజు గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5,984 లు గా కొనసాగుతుంది.

24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర నిన్న (శనివారం) రూ. 60, 000 లు ఉంది. ఈ రోజు రూ. 160 ల మేర తగ్గి 10. గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ. 59,840లుగా కొనసాగుతుంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ వాటిల్లో కూడా కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న (శనివారం) రూ. 5,515లు ఉంది. నేడు రూ. 15 లు తగ్గి గ్రాము పసిడి ధర రూ. 5,500లుగా కొనసాగుతుంది. అదే సమయంలో 10 గ్రాముల పసిడి ధర నిన్న రూ. 55,150లు ఉండగా.. రూ. 150 మేర తగ్గి ఈ రోజు రూ. 55,000లుగా కొనసాగుతుంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము ఈ రోజు 6,000లు ఉంది. అదే సమయంలో 10 గ్రాముల పసిడి ధర రూ. 60వేలు.

చైన్నై లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న (శనివారం) రూ. 5,530లు ఉంది. నేడు రూ. 20 లు తగ్గి గ్రాము పసిడి ధర రూ. 5,5100లుగా కొనసాగుతుంది.

24 క్యారెట్ల పసిడి గ్రాము ధర శనివారం రూ. 6,033ఉంది. ఈ రోజు 22 మేర తగ్గి గ్రాము పసిడి ధర రూ. 6,011లు గా కొనసాగుతుంది.  10 గ్రాముల  24 క్యారెట్ల పసిడి ధర 220 రూపాయలు తగ్గి.. నేడు రూ. 60,110లు గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న (శనివారం) రూ. 5,500లు ఉంది. నేడు రూ. 15 లు తగ్గి గ్రాము పసిడి ధర రూ. 5,485లుగా కొనసాగుతుంది. 10 గ్రాముల పసిడి ధర రూ.150 లు తగ్గి.. రూ. 54,850 ఉంది.

24 క్యారెట్ల పసిడి గ్రాము ధర 16 లు తగ్గి.. రూ. 5,984 కొనసాగుతుంది. అదే సమయంలో 10 గ్రాముల పసిడి ధర రూ. 160 తగ్గి 10 గ్రాములు రూ. 59,840లుగా కొనసాగుతుంది.

 వెండి ధర

బంగారం తర్వాత ఆ స్థాయిలో ఇష్టపడే లోహం వెండి. ఈ వెండిని ఒకప్పుడు పూజ సామాగ్రి, దేవుళ్లు, మెట్టెలు, పట్టీలు, ఇంట్లో ఉపయోగించే సామాన్లుగా వినియోగించేవారు. కాలంలో వచ్చిన మార్పులో భాగంగా ఇప్పుడు వెండితో బంగారానికి తీసిపోని విధంగా రకరకాల డిజైన్స్ తో నగలు కూడా చేస్తున్నారు. అవి కూడా మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వెండి వస్తువులను పెళ్లిళ్లు, ఫంక్షన్లలో గిఫ్ట్స్ గా ఇవ్వడానికి ఎక్కువుగా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఒకప్పుడు బంగారానికి పోటీనిస్తూ పైపైకి చేరుకున్న వెండి ధర క్రమంగా దిగివస్తుంది. ఆదివారం స్వల్పంగా సిల్వర్ కాస్ట్ తగ్గింది. ఒక గ్రాము వెండి ధర రూ. 73.50 పై లుగా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ, 73.500లుగా కొనసాగుతుంది. ఇదే ధరలు దేశంలో ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతుంది.

భారతదేశం తన బంగారం అవసరాలను తీర్చుకోవడానికి 90 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. ఎక్కుగా భారతీయులు వ్యక్తిగత వినియోగం కోసం నగలుగా కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. వివాహం, పండుగలతో పాటు ప్రత్యేక సందర్భాలలో బంగారానికి, వెండి కొనుగోలు చేయడానికి ఎక్కుగా ఇష్టపడతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ
బొప్పాయిని పరగడుపున తిని చూడండి.. శరీరంలో మ్యాజిక్‌ జరుగుతుంది..!
బొప్పాయిని పరగడుపున తిని చూడండి.. శరీరంలో మ్యాజిక్‌ జరుగుతుంది..!
ఉడికించిన గుడ్లతో హోటల్ స్టైల్ రెసిపీ.. ఇంట్లోనే చేసేయండిలా
ఉడికించిన గుడ్లతో హోటల్ స్టైల్ రెసిపీ.. ఇంట్లోనే చేసేయండిలా