Hyundai i20 Facelift: అయ్యారే ఐ20.. కొత్త కారు అదిరిపోయిందిగా.. ఫుల్లీ అప్‌డేటెడ్ వెర్షన్ ఇది..
సౌత్ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యాందాయ్ ఓ కారును మన దేశంలో లాంచ్ చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ నుంచి సరికొత్త ఐ20 ఫేస్ లిఫ్ట్ కారును ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ. 6.99లక్షల నుంచి హైఎండ్ మోడల్ రూ. 11.99 లక్షల వరకూ ఉంటుంది. 2023లో ఐ20 మోడల్ లో ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ డిజైన్ అప్ డేట్ చేయడంతో పటు పాటు పలు సేఫ్టీ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది.

సౌత్ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యాందాయ్ ఓ కారును మన దేశంలో లాంచ్ చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ నుంచి సరికొత్త ఐ20 ఫేస్ లిఫ్ట్ కారును ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ. 6.99లక్షల నుంచి హైఎండ్ మోడల్ రూ. 11.99 లక్షల వరకూ ఉంటుంది. 2023 హ్యుందాయ్ ఐ20 ఫేస్ లిఫ్ట్ మోడల్ లో ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ డిజైన్ ను అప్ డేట్ చేయడంతో పటు పాటు పలు సేఫ్టీ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది. అయితే మెకానికల్ భాగాలలో ఎటువంటి మార్పులు చేయలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రయాణికుల భద్రతే లక్ష్యం..
ఈ కొత్త ఐ20 ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరణ సందర్భంగా హ్యాందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఐ20 బ్రాండ్ నిలకడగా అమ్మకాలు చేపడుతూ ఒక ట్రెండ్ సృష్టించిందన్నారు. ఇప్పటికే 1.3 మిలియన్లకు పైగా వినియోగదారులను ఈ కారు సొంతం చేసుకుందన్నారు. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కొత్త హ్యుందాయ్ ఐ20 కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, సీట్‌బెల్ట్ రిమైండర్‌లను ఉంచినట్లు చెప్పారు. యువ తరాన్ని ఆకర్షించే విధంగా పలు ప్రత్యేక ఫీచర్లను కూడా తీసుకొచ్చినట్లు చెప్పారు.
కారు ఎక్స్‌టీరియర్ అదిరిపోయిందిగా..
2023 కొత్త ఐ20 ఫేస్‌లిఫ్ట్ లో అప్‌డేటెడ్ గ్రిల్‌తో పాటు సరికొత్త ఫ్రంట్ బంపర్ డిజైన్ ఇచ్చారు. హెడ్‌లైట్‌లు కూడా అప్‌డేట్ అయ్యాయి. సింగిల్ స్ట్రైక్ ఎల్ఈడీ డీఆర్ఎల్ తో పాటు ఆల్-ఎల్ఈడీ హెడ్‌లైట్ సెట్‌ను కలిగి ఉంటుంది. ముందు వైపు బంపర్ బాణం లాంటి ఆకారాన్ని పొందుతుంది. 2023 హ్యుందాయ్ ఐ20 కారు ఎరుపు + నలుపు పైకప్పుతో పాటు అమెజాన్ గ్రే (న్యూ), అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, స్టార్రీ నైట్, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్ + బ్లాక్ రూఫ్, ఫైరీతో సహా 6 మోనోటోన్ రంగులు, 2 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లతో అందుబాటులోకి ఉంటుంది. కొత్తగా డిజైన్ చేసిన మిర్రర్ క్యాప్స్,16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వెనుకవైపు జెడ్ ఆకారపు ఎల్ఈడీ టెయిల్ లైట్‌లతో ఒకే విధమైన అద్భుతమైన డిజైన్‌ను పొందుతుంది.
ఇంటరెస్టింగ్‌గా ఇంటీరియర్..
ఇంటీరియర్ విషయానికొస్తే, పాత మోడల్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది. డ్యూయల్-టోన్ స్కీమ్‌ను పొందుతుంది. యాంబియంట్ లైటింగ్, బోస్ 7-స్పీకర్ ప్రీమియం సిస్టమ్, అదే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫిజికల్ వాల్యూమ్ నాబ్ అందించారు. ఇంటీరియర్‌లోని ఇతర అప్‌డేట్‌లలో కొత్త సెమీ-లెథెరెట్ సీట్లు, లెథెరెట్ డోర్ ఆర్మ్‌రెస్ట్‌లు, కొత్త లెదర్‌తో కూడిన డీ కట్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. అదనంగా, 60కి పైగా కార్ కనెక్ట్ ఫీచర్లు ఉన్నాయి. 127 ఎంబెడెడ్ వీఆర్ కమాండ్‌లు, 52 హింగ్లీష్ వాయిస్ కమాండ్‌లు, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు, 10 ప్రాంతీయ, 2 అంతర్జాతీయ భాషలతో మల్టీలాంగ్వేజ్ యూఐ సపోర్ట్, టైప్-సి ఛార్జర్ కూడా ఉన్నాయి.
భద్రతకు భరోసా..
భద్రతా ఫీచర్లను పరిశీలిస్తే.. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో సహా 26 ప్రామాణిక భద్రతా లక్షణాలను పొందుతుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ కారు అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్‌లతో మూడు-పాయింట్ సీట్‌బెల్ట్‌ను కూడా పొందుతుంది. బర్గ్లర్ అలారం, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హైలైన్, హెడ్‌ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు వంటి 40 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఈ కారు వస్తుంది.
పవర్‌ట్రెయిన్ ఇలా..
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, కొత్త ఐ20 ఫేస్‌లిఫ్ట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (ఐవీటీ)తో అదే 1.2లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 87 బీహెచ్‌పీ పవర్ , 115 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఐడల్ స్టాప్ అండ్ గో(ఐఎస్జీ) ఫీచర్ ను ఈ కొత్త కారు కలిగి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..