- Telugu News Photo Gallery Business photos A fair of offers on cars.. Discount up to Rs.1 lakh on that car
Car Offers: కార్లపై ఆఫర్ల జాతర.. ఆ కారుపై ఏకంగా రూ.లక్ష వరకూ తగ్గింపు
సొంత కారు అనేది ప్రతి మధ్యతరగతి ఉద్యోగి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి రూపాయి రూపాయి కూడబెట్టుకుని కారును కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. భారతదేశంలో మధ్యతరగతి ప్రజల జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కంపెనీలు కూడా తక్కువ ధరకే బడ్జెట్ కార్లను రిలీజ్ చేస్తున్నాయి. అంతేకాకుండా పండుగ సమయాల్లో ఆయా కార్లపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఏకంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ తగ్గింపును అందిస్తున్నాయి. ఈ ఆఫర్లు సెప్టెంబర్ నెలాఖరు వరకూ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏయే కార్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Sep 11, 2023 | 7:22 PM

మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కార్లపై రూ.59,000 తగ్గింపును ఆ కంపెనీ అందిస్తుంది. వ్యాగన్ ఆర్ కారు బడ్జెట్ అనుకూల కారుగా పదేళ్ల నుంచి వినియోగదారుల ఆదరణను పొందుతుంది. ఈ వ్యాగన్ ఆర్ పెట్రోల్ వెర్షన్ కార్‌పై ఈ తగ్గింపును అందిస్తున్నారు. ఈ రూ.59 వేలల్లో రూ.35,000 ప్రత్యక్ష నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్చేంజ్ బోనస్ అందిస్తున్నారు.

మారుతీ సుజుకీకు సంబంధించిన సెలెరియోపై కూడా రూ.64 వేల తగ్గింపులను కంపెనీ అందిస్తుంది. వీఎక్స్‌ఐ ఎంటీ, జెడ్‌ఎక్స్‌ఐ ఎంటీ, జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ ఎంటీ వేరియంట్స్‌పైఘీ తగ్గింపు లభించనుంది. రూ. 40 వేల తక్షణ తగ్గింపుతో పాటు రూ.20 వేల ఎక్స్చేంజ్ బోనస్, అలాగే రూ. 4 వేల కార్పొరేట్ బోనస్ లభిస్తుంది.

హోండా సిటీ ఈ హెచ్‌వీపై ఏకంగా రూ. లక్షను హోండా కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా ఈవీ కార్లను ప్రోత్సహించేందకు కంపెనీ ఈ ఆఫర్‌ను ఇచ్చిందని ప్రతినిధులు పేర్కొంటున్నారు. సెడాన్ వెర్షన్‌పై కూడా హోండా కంపెనీ తగ్గింపును అందిస్తుంది.

మారుతీ సుజుకీ ఎగ్నిస్‌పై కూడా రూ.64 వేల తగ్గింపు లభిస్తుంది. ఇగ్నిస్ ఎంటీ, ఏఎంటీ మోడల్స్ ఈ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. రూ.35 వేల తక్షణ తగ్గింపుతో పాటు, రూ.15 వేల ఎక్స్చేంజ్ బెనస్‌తో పాటు రూ.10 వేల అదనపు ఎక్స్చేంజ్ బోనస్‌ను కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ కారుపై రూ.4 వేల కార్పొరేట్ బోనస్ వినియోగదారులకు అందించనుంది.

మధ్య తరగతి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుని మారుతీ సిఫ్ట్‌పై కూడా పండుగ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఈ కారుపై కొనుగోలుదారులు రూ.60 వేల వరకూ ఆదా చేసుకోవచ్చు. ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ వేరియంట్స్ రెండింటిలో ఈ ఆఫర్ పొందవచ్చు. రూ.35 వేల వరకూ తక్షణ తగ్గింపుతో పాటు రూ.20 వేల వరకూ ఎక్స్చేంజ్ బోనస్‌తోపాటు రూ. 5 వేల వరకూ కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది.





























