Asia Cup 2023: భారత్, పాక్ మ్యాచ్‌కు ప్రేమదాస స్టేడియం సిద్ధం.. హైవోల్టేజ్ మ్యాచ్‌కు వరుణుడే అడ్డంకి.. కొలంబోలో భారీ వర్ష సూచన
ఆసియా కప్ 2023 సూపర్ 4 మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా సిద్ధంగా ఉంది. ఈ టోర్నీలో పాకిస్థాన్, టీమ్ ఇండియా లు రెండోసారి పోటీ పడుతున్నాయి. ఇంతకు ముందు ఇరు జట్లు లీగ్ రౌండ్‌లో తలపడ్డాయి. అయితే వర్షం ఆ మ్యాచ్ ఫలితంపై ప్రభావాన్ని చూపించింది. మ్యాచ్ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా క్రికెట్ ప్రియులకు వరుణుడు చెక్ పెట్టేటట్లున్నాడు.
భారతదేశంలోకి అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న గేమ్ క్రికెట్.. భారత్ బరిలో ఉందంటేనే ఒక స్థాయిలో క్రేజ్ ఉంటుంది.. మరి అలాంటిది దాయాది దేశం పాక్ తో భారత్ తలపడుతుంది అంటే.. ఆ మ్యాచ్ కు వచ్చే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా టీవీ సెట్స్ ముందుకు వాలిపోతారు. ఈ నేపథ్యంలో చాలాకాలం తర్వాత ఆసియా కప్ లో భారత్ పాక్ లు తలపడుతున్నాయి.
ఆసియా కప్ 2023 సూపర్ 4 మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా సిద్ధంగా ఉంది. ఈ టోర్నీలో పాకిస్థాన్, టీమ్ ఇండియా లు రెండోసారి పోటీ పడుతున్నాయి. ఇంతకు ముందు ఇరు జట్లు లీగ్ రౌండ్‌లో తలపడ్డాయి. అయితే వర్షం ఆ మ్యాచ్ ఫలితంపై ప్రభావాన్ని చూపించింది. మ్యాచ్ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా క్రికెట్ ప్రియులకు వరుణుడు చెక్ పెట్టేటట్లున్నాడు.
ఇప్పుడు ఈ సూపర్ 4 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఈ రోజు ఎంత మేర జరిగినా రేపు పూర్తి కావడం ఖాయం.
ఈరోజు కొలంబోలో భారీ వర్షం కురిసే సూచన ఉందని, రిజర్వ్ డే రోజు కూడా వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ నివేదించింది.
వాస్తవానికి శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య నిన్నటి సూపర్ 4 రౌండ్ మ్యాచ్ కూడా కొలంబోలోనే జరిగింది. కానీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం కురవకపోవడంతో ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ పూర్తయింది. మ్యాచ్ ఆద్యంతం వాతావరణం మేఘావృతమైనప్పటికీ వర్షం అంతగా మ్యాచ్ కు అంతరాయం కలిగించలేదు. అయితే భారత్-పాక్ మ్యాచ్‌కు మాత్రమే వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కొలంబోలో భారీ వర్ష సూచన
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భారత్, పాక్ జట్లు కొలంబోలోని ప్రేమ దాస స్టేడియంలో తలపడనున్నాయి. అయితే వాతావరణ నివేదిక ప్రకారం ఆ సమయంలో కొలంబోలో 92 శాతం వర్షం పడుతుంది. అలాగే, మ్యాచ్‌కు గంట ముందు 91 శాతం వర్షం కురుస్తుంది. అలాగే సాయంత్రం 4 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉంది. కాగా రాత్రి 11 గంటల వరకు 87 శాతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదిక పేర్కొంది.
రిజర్వ్ డే రోజున ఏ విధంగా మ్యాచ్ జరగనుందంటే..
సెప్టెంబరు 10తో పోలిస్తే సెప్టెంబరు 11 నాటి వాతావరణాన్ని పరిశీలిస్తే కొంత మేర ఉపశమనం లభించినా రేపు కూడా భారీ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే కొంత ఉపశమనం ఏమిటంటే.. రేపు ఉదయం మాత్రమే వర్షం కురిసి.. మధ్యాహ్నం నుంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉందని సమాచారం. రోజు గడిచే కొద్దీ వర్షం తగ్గుతుంది. సెప్టెంబర్ 11 సాయంత్రం నాటికి కొలంబోలో వర్షం పడే అవకాశం 64 శాతానికి తగ్గుతుంది. దీంతో మ్యాచ్ రిజర్వ్ డేలో జరగడం ఖాయమని అంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..