AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK, Asia Cup 2023 Highlights: రిజర్వ్ డేకు మారిన మ్యాచ్ ఫలితం.. తడి పిచ్‌తో కీలక నిర్ణయం..

India vs Pakistan, Asia Cup 2023 Highlights: టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తోన్న టీమ్‌ఇండియా టీమ్‌ఇండియాకు శుభారంభం అందించింది. షహీన్ అఫ్రిదిపై తొలి ఓవర్‌లోనే రోహిత్ భారీ సిక్సర్ కొట్టాడు. షాహీన్ వేసిన 2 ఓవర్లలో ఓపెనర్లు తలో 3 ఫోర్లు బాదారు. దీంతో ఆ జట్టు 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది.

IND vs PAK, Asia Cup 2023 Highlights: రిజర్వ్ డేకు మారిన మ్యాచ్ ఫలితం.. తడి పిచ్‌తో కీలక నిర్ణయం..
Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Sep 10, 2023 | 8:59 PM

Share

IND vs PAK, Asia Cup 2023 Highlights: ఆసియాకప్‌లో సూపర్‌-4 దశలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్షం, ఔట్‌ఫీల్డ్ తడి కారణంగా ఆదివారం ఆట సాగలేదు. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజున అంటే సోమవారం మధ్యాహ్నం 3:00 గంటల నుంచి నిర్వహించనున్నరు. ఈరోజు ఎక్కడి వరకు ఆగిపోయిందో.. రేపు మ్యాచ్‌‌ను తిరిగి అక్కడి నుంచే మళ్లీ ప్రారంభించనున్నారు. ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా 24.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఇక్కడి నుంచే మ్యాచ్ జరగనుంది.

ఆసియా కప్ 2023 సూపర్-4 రౌండ్ మ్యాచ్ ఈరోజు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కు అవకాశం కల్పించారు. మహ్మద్ షమీ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఆడాడు.

టోర్నీలో ఇరు జట్ల మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటింగ్ మాత్రమే పూర్తయింది. ఈసారి కూడా మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, రేపు ఈ మ్యాచ్‌కి ఆసియా క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్ డేని ప్రకటించింది.

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 10 Sep 2023 08:57 PM (IST)

    రేపటికి వాయిదా పడిన మ్యాచ్..

    ఆసియాకప్‌లో సూపర్‌-4 దశలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్షం, ఔట్‌ఫీల్డ్ తడి కారణంగా ఆదివారం ఆట సాగలేదు. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజున అంటే సోమవారం మధ్యాహ్నం 3:00 గంటల నుంచి నిర్వహించనున్నరు. ఈరోజు ఎక్కడి వరకు ఆగిపోయిందో.. రేపు మ్యాచ్‌‌ను తిరిగి అక్కడి నుంచే మళ్లీ ప్రారంభించనున్నారు. ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా 24.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఇక్కడి నుంచే మ్యాచ్ జరగనుంది.

  • 10 Sep 2023 08:53 PM (IST)

    మళ్లీ కొనసాగుతోన్న వాదనలు..

    జుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో రెండు పిటిషన్లు దాఖలు చేయగా.. ఇప్పుడు దానిపై వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కస్టడీకి అప్పగించాలని సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పుడు వాటిపై వాదనలు కొనసాగుతున్నాయి.

    1. జైలుకు తరలించకుండా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని లేదా కేంద్ర కారాగారానికి తరలించినట్టు అయితే అక్కడ ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించాలని ఒక పిటిషన్‌
    2. చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఇంటి భోజనం, మందులు తీసుకునేందుకు అనుమతించాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు.
    3. మరో వైపు చంద్రబాబును విచారించేందుకు వారం పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ కూడా పిటిషన్‌ దాఖలు చేసింది.
  • 10 Sep 2023 08:36 PM (IST)

    9గంటలకు మొదలయ్యేనా?

    మరోసారి వర్షం మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో కవర్లను మైదానంలోకి తీసుకొస్తున్నారు. ఏనిర్ణయమైనా 9 గంటల తర్వాతే తేలనుంది.

  • 10 Sep 2023 08:22 PM (IST)

    తడి పిచ్.. మరో 10 నిమిషాల్లో మరోసారి పరీక్షించనున్న అంపైర్లు..

    తడి పిచ్‌తో అంపైర్లు సందిగ్ధంలో పడ్డారు. మరో 10 నిమిషాల తర్వాత మ్యాచ్ పరిస్ధితిపై కీలక అప్ డేట్ రావొచ్చని తెలుస్తోంది.

  • 10 Sep 2023 06:40 PM (IST)

    పిచ్‌ను సిద్ధం చేస్తోన్న సిబ్బంది..

    ప్రస్తుతం వర్షం తగ్గింది. భారీ వర్షం కురవడంతో పిచ్ బాగా తడిసిపోయింది. దీంతో పిచ్‌ను పొడిగా మార్చేందుకు సిబ్బంది తెగ శ్రమిస్తున్నారు. అయితే, మ్యాచ్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో మాత్రం అంపైర్లు ఇంకా ప్రకటించలేదు.

  • 10 Sep 2023 05:44 PM (IST)

    తగ్గిన వర్షం..

    వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో గ్రౌండ్‌ సిబ్బంది కవర్స్‌పై ఉన్న నీటిని తొలగించే పనిలో ఉన్నారు.

  • 10 Sep 2023 04:55 PM (IST)

    వర్షంతో ఆగిన మ్యాచ్

    24 ఓవర్ల తర్వాత వర్షం పడుతుండడంతో మ్యాచ్‌ను ఆపేశారు. ఈ క్రమంలో టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.

  • 10 Sep 2023 04:52 PM (IST)

    తగ్గిన పరుగుల వేగం..

    24 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది. కోహ్లీ 7, కేఎల్ రాహుల్ 17 పరుగులతో నిలిచారు.

  • 10 Sep 2023 04:29 PM (IST)

    PAK vs IND Live Score: పెవిలియన్ చేరిన గిల్..

    రోహిత్ తర్వాత గిల్ (58 పరుగులు, 4 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 123 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. కేవలం 3 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లను భారత్ కోల్పోయింది.

  • 10 Sep 2023 04:22 PM (IST)

    రోహిత్ ఔట్..

    డ్రింక్స్ తర్వాత టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ 56 పరుగుల తర్వాత షాబాద్ కాన్ బౌలింగ్‌లో ఫహీమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 121 పరుగుల ఓపెనర్ల భాగస్వామ్యానికి తెరపడింది.

  • 10 Sep 2023 04:13 PM (IST)

    పవర్‌ప్లేలో దూకుడు..

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తోన్న టీమ్‌ఇండియా టీమ్‌ఇండియాకు శుభారంభం అందించింది. షహీన్ అఫ్రిదిపై తొలి ఓవర్‌లోనే రోహిత్ భారీ సిక్సర్ కొట్టాడు. షాహీన్ వేసిన 2 ఓవర్లలో ఓపెనర్లు తలో 3 ఫోర్లు బాదారు. దీంతో ఆ జట్టు 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది.

  • 10 Sep 2023 04:10 PM (IST)

    IND vs PAK Live Score: హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు..

    15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఓపెనర్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేయడంతో టీమిండియా స్కోర్ 115 పరుగులు చేసింది. రోహిత్ 55, గిల్ 53 పరుగులతో నిలిచారు.

  • 10 Sep 2023 03:50 PM (IST)

    హాఫ్ సెంచరీకి చేరువలో గిల్..

    తొలుత బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది. గిల్ తన ఎనిమిదో వన్డే అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు.

  • 10 Sep 2023 03:38 PM (IST)

    హాఫ్ సెంచరీకి చేరువలో భారత్..

    టీమిండియా ఓపెనర్లు 8 ఓవర్లు ముగిసి సరికి 47 పరుగులు చేశారు. ఇందులో రోహిత్ 10, గిల్ 35 పరుగులతో నిలిచారు.

  • 10 Sep 2023 03:24 PM (IST)

    5 ఓవర్లకు 37 పరుగులు..

    5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 37 పరుగులు చేసింది. రోహిత్ 10, గిల్ 25 పరుగులతో క్రీజులో నిలిచాడు.

  • 10 Sep 2023 03:09 PM (IST)

    2 ఓవర్లకు 11 పరుగులు..

    2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 11 పరుగులు చేసింది. రోహిత్ 10, గిల్ 1 పరుగుతో క్రీజులో నిలిచారు.

  • 10 Sep 2023 03:02 PM (IST)

    ఓపెనర్లుగా రోహిత్, గిల్..

    బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తరపున ఓపెనర్లుగా రోహిత్, గిల్ క్రీజులోకి వచ్చారు.

  • 10 Sep 2023 02:57 PM (IST)

    మొదలైన భారత బ్యాటింగ్..

  • 10 Sep 2023 02:40 PM (IST)

    భారత ప్లేయింగ్ 11లో రెండు మార్పులు..

    భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కు అవకాశం కల్పించారు. మహ్మద్ షమీ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఆడాడు.

  • 10 Sep 2023 02:39 PM (IST)

    ఇరుజట్లు:

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

    పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.

  • 10 Sep 2023 02:32 PM (IST)

    టాస్ గెలిచిన పాక్

    టాస్ గెలిచిన పాకిస్తాన్, తొలుత బౌలింగ్ ఎంచుకంది. దీంతో రోహిత్ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది.

  • 10 Sep 2023 02:11 PM (IST)

    స్టేడియం చేరిన ఇరుజట్లు…. కొలంబోలో స్పష్టమైన వాతావరణం

    ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ కోసం భారత్-పాకిస్థాన్ జట్లు స్టేడియానికి చేరుకున్నాయి. ప్రస్తుతం కొలంబోలో వాతావరణం స్పష్టంగా ఉంది. ఎండ కొడుతోంది. ప్రస్తుతం వర్షం జాడ లేదు.

  • 10 Sep 2023 02:10 PM (IST)

    పాకిస్థాన్‌పై టీమిండియా?

    పాకిస్థాన్‌తో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పునకు అవకాశం తక్కువ. సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బుమ్రా తిరిగి జట్టులోకి రావొచ్చు. కొడుకు పుట్టడం వల్ల చివరి మ్యాచ్ ఆడలేదు. కేఎల్ రాహుల్ కూడా జట్టులోకి రావడంపై చర్చ జరుగుతోంది.

    భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

  • 10 Sep 2023 02:08 PM (IST)

    పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌

    భారత్‌తో సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ ఎలా ఉంటుందో చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు పాకిస్థాన్ తన ఆడే పదకొండు ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో ఆడుతున్న జట్టునే పాకిస్థాన్ రంగంలోకి దించింది.

    పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్: బాబర్ అజామ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.

  • 10 Sep 2023 02:03 PM (IST)

    IND vs PAK Weather Update: సెప్టెంబర్ 10న కొలంబోలో వాతావరణం ఎలా ఉంటుందంటే?

    కొలంబో వేదికగా ఈరోజు భారత్‌-పాక్‌ల మధ్య భారీ పోరు జరుగుతోంది. అయితే ఈ గ్రేట్ మ్యాచ్‌పై భారీ వర్షం కురుస్తోంది. Weather.com ప్రకారం, కొలంబోలో 100 శాతం వర్షం పడే అవకాశం ఉంది.

  • 10 Sep 2023 01:58 PM (IST)

    భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్..

    ఈరోజు ఆసియాకప్‌లో భాగంగా సూపర్‌-4లో పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై వర్షం నీడ కొనసాగుతోంది. అయితే, దీనికి రిజర్వ్ డే ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌కు ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరే అవకాశాలు పెరుగుతాయి. పాకిస్థాన్‌పై ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఈ ఓటమి తర్వాత శ్రీలంకతో తదుపరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. సూపర్-4 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్, శ్రీలంకలు విజయం సాధించాయి.

Published On - Sep 10,2023 1:57 PM