AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వామ్మో.. ఏందమ్మీ ఇది.. బ్యాటర్‌కే బుర్ర తిరిగిపోయిందిగా.. వెస్టిండీస్‌లో దుమ్మురేపిన ఆర్‌సీబీ ప్లేయర్..

Shreyanka Patil Bowling Video: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున శ్రేయాంక పాటిల్ ఆడుతోంది. అరంగేట్రం టోర్నీలోనే సత్తా చాటిన ఈ యువ క్రీడాకారిణి.. ఇప్పుడు విదేశీ లీగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తోంది. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో శ్రేయాంక 3 మ్యాచ్‌ల్లో మొత్తం 6 వికెట్లు పడగొట్టింది. దీంతో ప్రస్తుత టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచింది.

Video: వామ్మో.. ఏందమ్మీ ఇది.. బ్యాటర్‌కే బుర్ర తిరిగిపోయిందిగా.. వెస్టిండీస్‌లో దుమ్మురేపిన ఆర్‌సీబీ ప్లేయర్..
Shreyanka Patil
Venkata Chari
|

Updated on: Sep 07, 2023 | 12:05 PM

Share

Women’s Caribbean Premier League: వెస్టిండీస్‌లో జరుగుతున్న మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో శ్రేయాంక పాటిల్ సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన శ్రేయాంక.. ఇప్పుడు తన స్పిన్ మాయాజాలంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరపున ఆడుతున్న 21 ఏళ్ల ఈ భారత ప్లేయర్.. అంతకుముందు జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో తన సత్తా చాటింది. ఇప్పుడు సీపీఎల్‌లోనూ ఆల్‌రౌండర్‌ రాణిస్తోంది.

ట్రిన్ బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా తరపున ఆడిన శ్రేయాంక 4 ఓవర్లలో 15 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టింది. అలాగే ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా శ్రేయాంక వేసిన 16వ ఓవర్లో బ్రిటానీ కూపర్ క్లీన్ బౌల్డ్ అయింది. ఆఫ్ స్టంప్ వెలుపల బంతి వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విండీస్‌లో సత్తా చాటుతోన్న భారత ప్లేయర్..

మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో శ్రేయాంక 3 మ్యాచ్‌ల్లో మొత్తం 6 వికెట్లు పడగొట్టింది. దీంతో ప్రస్తుత టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచింది.

 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి..

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున శ్రేయాంక పాటిల్ ఆడింది. అరంగేట్రం టోర్నీలోనే సత్తా చాటిన ఈ యువ క్రీడాకారిణి.. ఇప్పుడు విదేశీ లీగ్‌లోనూ మెరుపులు మెరిపించడం విశేషం.

ఫ్యాన్స్ ట్వీట్స్..

గయానా అమెజాన్ వారియర్స్ ప్లేయింగ్ XI: స్టెఫానీ టేలర్ (కెప్టెన్) సోఫీ డివైన్, సుజీ బేట్స్, షెమైన్ క్యాంప్‌బెల్ (వికెట్ కీపర్), నటాషా మెక్లీన్, షబికా ఘజన్బీ, శ్రేయాంక పాటిల్, షనేతా గ్రిమ్మండ్, కరిష్మా రంహారక్, షబ్నీమ్ ఇస్మాయిల్, షకేరా సెల్మాన్.

ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: డియాండ్రా డాటిన్ (కెప్టెన్), మేరీ కెల్లీ, లీ-ఆన్ కిర్బీ, కిసియా నైట్ (వికెట్ కీపర్), మిగ్నాన్ డు ప్రీజ్, కిషోనా నైట్, బ్రిటనీ కూపర్, జైదా జేమ్స్, అనీస్ మొహమ్మద్, షామిలియా కానెల్, ఫ్రాన్ జోనాస్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..