Unique Love: మంచిర్యాల అమ్మాయి.. బ్రిటన్ అబ్బాయి.. హిందూ సంప్రదాయంలో ముచ్చటగా మూడు ముళ్లతో ఒక్కటైన జంట

ప్రేమకు కులం మతం వర్గం వర్ణమే కాదు దేశాలు ఖండాలు కూడా కూడా అడ్డుకాదని నిరూపించింది ఈ జంట ప్రేమ పెళ్లి. పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్లి చేసుకుంది ఈ జంట. ఆ అబ్బాయి పేరు బెన్.. బ్రిటన్ కు చెందిన అబ్బాయి.. తల్లిదండ్రులు రోజర్ నిగెల్, జీన్ లైటౌలర్. అమ్మాయి పేరు సింధూర. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలానికి చెందిన కొత్త మహేందర్, సుజాతల కూతురు.

Unique Love: మంచిర్యాల అమ్మాయి.. బ్రిటన్ అబ్బాయి.. హిందూ సంప్రదాయంలో ముచ్చటగా మూడు ముళ్లతో ఒక్కటైన జంట
british boy telangana girl marriage
Follow us
Naresh Gollana

| Edited By: Surya Kala

Updated on: Sep 02, 2023 | 12:23 PM

అవును వాళ్లిద్దరు ఒక్కటయ్యారు. సప్తసముద్రాల ఆవల పుట్టిన ప్రేమ.. సంద్రాలు దాటి.. ఖండాలు దాటి మూడు ముళ్లతో ఒక్కటైంది. పెద్దలు నిర్ణయించిన సుముహూర్తాన హిందూ సంప్రదాయం ప్రకారం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఒక్కటైంది ఆ జంట. అమ్మాయి అక్షరాల అచ్చ తెలుగమ్మాయి.. అబ్బాయి బ్రిటన్ దేశం. యూకేలోని కళాశాలలో పుట్టిన ప్రేమ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి సందడిగా మారి ఆ ఇంట పండుగ వాతావరణాన్ని తెచ్చింది. మూడు ముళ్లతో ఒక్కటైన మంచిర్యాల అమ్మాయి.. బ్రిటన్ అబ్బాయి ముచ్చటే ఇది.‌

ప్రేమకు కులం మతం వర్గం వర్ణమే కాదు దేశాలు ఖండాలు కూడా కూడా అడ్డుకాదని నిరూపించింది ఈ జంట ప్రేమ పెళ్లి. పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్లి చేసుకుంది ఈ జంట. ఆ అబ్బాయి పేరు బెన్.. బ్రిటన్ కు చెందిన అబ్బాయి.. తల్లిదండ్రులు రోజర్ నిగెల్, జీన్ లైటౌలర్. అమ్మాయి పేరు సింధూర. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలానికి చెందిన కొత్త మహేందర్, సుజాతల కూతురు. ఉన్నత చదువుల‌ కోసం యూకే బాట పట్టిన సింధూర బ్రిటన్ యూనివర్సిటీలో బెన్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కులాలు వేరు మతాలు కూడా వేరు అయినా వాళ్ల ప్రేమకు ఇవేమి అడ్డంకి కాలేదు. ఇరు కుటుంబాలు వీరిద్దరి ప్రేమకు ఓకే చెప్పడంతో పెద్దలు కుదిర్చిన ముహుర్తానికి హైదరాబాద్ లోని షామీర్ పేట రిసార్ట్స్ వేదికగా హిందూ సంప్రదాయంలో మూడు ముళ్ల బంధంతో ఒకటైంది.

బ్రిటన్‌ కు చెందిన బెన్, లక్షేట్టిపేట కు చెందిన కొత్త సింధూరతో జరిగిన వివాహానికి వరుడి తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు హాజరై నవ దంపతులను దీవించారు.సింధూర యూకేలో ఎంఎస్ చదువుతున్న సమయంలో సహ విద్యార్థి బెన్ లైటౌలర్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ప్రస్తుతం బెన్ లైటౌలర్ జర్మనీలో, సింధూర యూకేలో ఉద్యోగం చేస్తున్నారు. తమకు తెలుగు సంప్రదాయం నచ్చిందని, తమ దేశంలో ఇలాంటి వివాహ విధానం లేదని, సింధూర తమ కుటుంబంలో సభ్యురాలు అయినందుకు హ్యాపీగా ఉందని చెబుతున్నారు బెన్ తల్లిదండ్రులు.

ఇవి కూడా చదవండి

భారతదేశానికి వచ్చిన సందర్బంలో ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు నచ్చడంతో ఇక్కడే వివాహం చేసుకోవాలని బెన్ ఫిక్స్ అయినట్టుగా తెలిపాడు‌. హిందూ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వివాహ పద్ధతులు తెలుసుకున్న బెన్ హైదరబాద్ లోనే పెళ్లికి ఆసక్తి చూపించాడు. బెన్ మొదట తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు రోజర్ నిగెల్, జీన్ లైటౌలర్ లకు చెప్పడంతో వారూ వెను వెంటనే ఓకే చెప్పడం.. ఇటు సింధూర సైతం తన తాత కొత్త శంకరయ్యకు నచ్చ చెప్పడంతో.. సింధూర కుటుంబం కూడా బెన్ – సింధూరల ప్రేమకు అంగీకారం తెలిపడంతో ఇదిగో‌ ఇలా శ్రావణ శుక్రవారం వేళ మూడు ముళ్లతో ఒక్కటైంది జంట. తెలంగాణ సంప్రదాయం.. హైదరాబాద్‌ వాతవరణం మరింత నచ్చిందని బెన్ బంధువులు ఆనందంతో తెలిపారు. మొత్తానికి ప్రేమంటే ఇదేరా అంటే ఇదే అన్నట్టుగా సాగింది బెన్ సింధూరల పెళ్లి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..