- Telugu News Photo Gallery G20 Dinner: International delegates embrace Indian fashion,japan pm fumio kishida wife mauritius pm pravind kumar wife wear saree Telugu News
G20 Dinner: జి-20 సదస్సులో రాష్ట్రపతి ప్రత్యేక విందు.. చీరకట్టులో కనిపించిన విదేశీ ప్రముఖులు..
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న జి20 సదస్సులో రాష్ట్రపతి ఇచ్చిన విందు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జీ20 సదస్సు విచ్చేసిన ప్రముఖులకు స్పెషల్ విందు ఏర్పాటు చేశారు. జి20 సదస్సుకు వచ్చిన ప్రముఖులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ప్రత్యేక విందుకు ఆహ్వానించారు. భారత్ మండపంలో వారందరికీ ఈ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. G20 సదస్సులో భారతదేశ గొప్ప సంస్కృతిని ఆవిష్కరించారు. ఈ విందులో పలువురు విదేశీ ప్రముఖులు చీరలు ధరించడం విశేషం.
Updated on: Sep 10, 2023 | 1:28 PM

అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము జి20 నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందు సందర్భంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భార్య యుకో కిషిడా రాష్ట్రపతి ఆహ్వాన విందుకు చీరలో వచ్చారు.

మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్‌నాథ్ భార్య కోబితా జుగ్‌నాథ్ చీర కట్టుకుని జీ20 నేతల ప్రత్యేక విందుకు వచ్చారు.

జీ 20 సదస్సు ప్రత్యేక విందు సందర్బంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ముత్యాల హారంతో కూడిన చీరలో మన దేశం శోభను చాటారు.

UK ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి తన ఆధునిక దుస్తులకు సాంప్రదాయిక టచ్ జోడించి మరింత ప్రత్యేకంగా కనిపించారు.

G 20 డిన్నర్ సందర్బంగా IMF చీఫ్ జార్జివా కూడా ప్రత్యేక డ్రెస్‌లో కనిపించారు. G-20 డిన్నర్ కోసం ఢిల్లీలోని భారత్ మండపానికి ఆమె బంగారు దుపట్టాతో కూడిన పర్పుల్ దేశీ సూట్‌లో వచ్చారు.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా భార్య త్షెపో మోట్సెపే ఇండో-వెస్ట్రన్ (South African President Cyril Ramaphosa's wife Tshepo Motsepe)దుస్తులను ధరించారు. ఆమె తన జుట్టును బన్ కట్టి, దానిని మరింత అందంగా అలంకరించారు.
