Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Robbery Video Viral: ఏటీఎం చోరీకి భారీ స్కెచ్‌.. ప్లాన్‌ బెడిసి కొట్టడంతో చివరకు సీన్ రివర్స్..! వీడియోలో చూసేయండి..

ఈ వీడియోలో కొందరు దొంగలు ఏటీఎంను దోచుకునేందుకు ప్లాన్‌ చేశారు. వారి ప్లాన్‌ ప్రకారం..ఓ కారుతో ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ముందుగా దొంగలు కారుకు తాడు కట్టారు. తాడు మరో కొనను ఏటీఎం సెంటర్లలోని ఏటీఎం మిషన్‌కు తగిలించారు. ఆ తర్వాత కారు స్టార్ట్‌ చేశారు. అలా కారు వేగంగా స్టార్ట్‌ చేయటంతో ఏటీఎం మిషన్‌ మొత్తం ఒకేసారి ఊడిపోయి బయటపడింది.. దాంతో..

ATM Robbery Video Viral: ఏటీఎం చోరీకి భారీ స్కెచ్‌.. ప్లాన్‌ బెడిసి కొట్టడంతో చివరకు సీన్ రివర్స్..! వీడియోలో చూసేయండి..
Atm Robbery
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 09, 2023 | 12:37 PM

ATM దోపిడీ వీడియో వైరల్: ఆభరణాలు, మొబైల్, బైక్, నగదు మొదలైనవి చోరీకి గురైన సంఘటనల గురించి మీరు చాలాసార్లు విని ఉంటారు. చూసి ఉంటారు కూడా. అలాగే, చాలా సందర్భాల్లో ఏటీఎం దొంగతనాల గురించి కూడా వినే ఉంటారు. ఏటీఎం మిషన్లను ధ్వంసం చేసిన దుండగులు నగదు దోచుకెళ్లటం, లేదంటే.. ఏకంగా ఏటీఎం మిషిన్‌నే ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా గతంలో వార్తల్లో చూశాం. అలాంటిదే ఇక్కడో ATM దోపిడీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది ముసుగు దొంగలు ATM దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం వారు వేసిన ప్లాన్‌ గతంలో ఎప్పుడూ వినుండరు. అలాంటి షాకింగ్ కేసు ఒకటి మహారాష్ట్ర నుండి వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఏటీఎం చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. బీడ్‌లో కొందరు ముసుగు దొంగలు ఏటీఎం మెషీన్‌ను చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. అయితే నగదుతో పాటు ఏటీఎంను చోరీ చేసినందుకు దొంగలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ATM మిషిన్‌ ఎత్తుకెళ్లేందుకు వారు చేసిన ప్రయత్నం, ఆ తరువాత ఏం జరిగిందో మొత్తం అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తే మీరు కూడా అవాక్కవ్వాల్సిందే..

ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో కొందరు దొంగలు ఏటీఎంను దోచుకునేందుకు ప్లాన్‌ చేశారు. వారి ప్లాన్‌ ప్రకారం..ఓ కారుతో ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ముందుగా దొంగలు కారుకు తాడు కట్టారు. తాడు మరో కొనను ఏటీఎం సెంటర్లలోని ఏటీఎం మిషన్‌కు తగిలించారు. ఆ తర్వాత కారు స్టార్ట్‌ చేశారు. అలా కారు వేగంగా స్టార్ట్‌ చేయటంతో ఏటీఎం మిషన్‌ మొత్తం ఊడి వచ్చేస్తుందని వారి ప్లాన్‌ . కానీ, వారి ప్లాన్‌ బెడిసికొట్టింది. కారుతో ATMను ఎత్తుకెళ్లాలని భావించిన దొంగలకు తిక్క కుదిరింది. ఏటీఎంను కారు తాడుతో కట్టేసిన దొంగ అక్కడే నిలబడి ఉన్నాడు. కారులో ఉన్న డ్రైవర్‌ని కారు స్టార్ట్‌ చేయాలని చెబుతాడు.. కారు స్టార్ట్‌ అవగానే.. ఏటీఎం మిషన్‌ విరిగిపోయి స్పీడ్‌గా దూసుకొచ్చింది.. ఏటీఎం డోర్‌ వద్దే నిలబడి ఉన్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దాంతో అతడు ఉన్నాడో.. ప్రాణం పోయిందో తెలియదుగానీ, ఒక్కదెబ్బతో అతడు నెలకరుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన సెప్టెంబర్ 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిందని తెలిసింది. దోపిడీ దొంగలు పక్కా స్కెచ్‌తో ఏటీఎం చోరీకి వచ్చారు. కానీ,వారి సక్సెస్ కాలేదు. ఏటీఎం విరిగి దొంగపడినంతలోనే ఏటీఎంలో అమర్చిన సెక్యూరిటీ సర్వీస్‌ ద్వారా దొంగతనం జరిగినట్లు సమాచారం పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏటీఎం చోరీకి గురికాకుండా కాపాడారు. కానీ, ముసుగు దొంగలు తప్పించుకున్నట్టుగా తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..