Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బురద తంటాలు.. బూట్లు పాడవకుండా బుల్డోజర్‌ ఎక్కిన ఇద్దరు యువకులు.. బ్యాలెన్స్‌ కోల్పోవటంతో ..

వైరల్‌ వీడియోలో ఇద్దరు యువకులు బుల్డోజర్‌లో కూర్చుని ఉన్నారు. చూసేందుకు మాత్రం నీట్‌గా డ్రస్‌ చేసుకుని కనిపిస్తున్నారు. బహుశ వారు చూస్తుంటే.. ఆఫీకు వెళ్తున్నారనుకుంటా. అయితే, వాళ్లు వెళ్తున్న దారిలో బురద కాలువ ఒకటి అడ్డుగా ఉంది. దాన్ని దాటేందుకు వారు బుల్డోజర్‌ సాయం తీసుకున్నారు. వీడియోలో కనిపించినట్టుగా వారు..బుల్డోజర్‌లో కూర్చున్నారు.

బురద తంటాలు.. బూట్లు పాడవకుండా బుల్డోజర్‌ ఎక్కిన ఇద్దరు యువకులు.. బ్యాలెన్స్‌ కోల్పోవటంతో ..
Bulldozer
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 09, 2023 | 10:40 AM

భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఎక్కడ పడితే అక్కడ వర్షపు నీరు, బురద చేరిపోవటంతో ప్రజలు అవస్థలుపడుతున్నారు. సిటీలు, పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనీజీలు పొంగిపోర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరదలో నీటిలో పడి కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మరికొన్ని చోట్ల పిల్లలు, పెద్దలు కూడా మ్యాన్‌ హోల్స్‌లో పడి గల్లంతైన ఘటనలు కూడా చూశాం..ఇక చాలా చోట్ల వర్షం తగిన తర్వాత కూడా బురద అలాగే ఉంటుంది. బురదలో కాలు జారి పడిపోవడం కూడా మామూలే. పొరపాటున బురదపై అడుగు పెట్టారో ఇక అంతే.. ఎక్కడ జారిపడితే..ఏం విరుగుతుందో కూడా తెలియదు.. ఒంటిపై ఉన్న బట్టలు కూడా బురదమయంగా మారుతాయి. అందువల్లే ఎక్కడ బురద చూసినా వెంటనే జాగ్రత్త పడుతున్నారు జనాలు. బురద కారణంగా చెప్పులు, బూట్లు కూడా పాడవుతుంటాయి. అందుకే ప్రజలు బురద నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే బురద నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ ఇద్దరు యువకులు బుల్డోజర్ను ఆశ్రయించారు.. ఆ తరువాత  ఏం జరిగిందో చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ఇద్దరు యువకులు బుల్డోజర్‌లో కూర్చుని ఉన్నారు. చూసేందుకు మాత్రం నీట్‌గా డ్రస్‌ చేసుకుని కనిపిస్తున్నారు. బహుశ వారు చూస్తుంటే.. ఆఫీకు వెళ్తున్నారనుకుంటా. అయితే, వాళ్లు వెళ్తున్న దారిలో బురద కాలువ ఒకటి అడ్డుగా ఉంది. దాన్ని దాటేందుకు వారు బుల్డోజర్‌ సాయం తీసుకున్నారు. వీడియోలో కనిపించినట్టుగా వారు..బుల్డోజర్‌లో కూర్చున్నారు. అది వారిని మెల్లిగా అవతలి ఒడ్డుకు తీసుకెళ్లింది. కాసేపట్లో ఒడ్డుకు చేరుకుంటారనగా ఊహించని సీన్‌ ఎదురైంది. గట్టుకు చేరామని అనుకునేలోపుగానే..అమాంతంగా బురదలో పడిపోయారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియోలో యువకులిద్దరూ బురదలో పడతారు. కాళ్లకు వేసుకున్న బూట్లు, చెప్పులు పాడవకుండా ఉండాలని వారు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి.. పూర్తిగా బురదలో మునిగిపోవాల్సి వచ్చింది. నిలువునా బురదలో తడిసిపోయిన తర్వాత ఆ ఇద్దరూ ఎలాగోలా లేచి బురదలోంచి బయటికి వస్తారు. ఇద్దరు యువకుల నిస్సహాయత ఈ 22 సెకన్ల వీడియోలో చూడవచ్చు. ఇప్పటి వరకు వేల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియోపై కొందరు ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. వీడియోను షేర్ చేసిన ఒక వినియోగదారు బుల్డోజర్లను దుర్వినియోగం చేయకూడదని క్యాప్షన్‌లో రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..