Google Maps: గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటే నట్టేట ముంచింది
సిద్ధిపేట జిల్లాలో ఓ లారీ డ్రైవర్ గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా గమ్యానికి వెళ్లాలనుకున్నాడు. కానీ తీరా చూస్తే కథ అడ్డం తిరిగింది. మ్యాప్‌లో రోడ్డుంది గానీ కళ్ల ముందు పెద్ద ప్రమాదం కనిపించింది. సెప్టెంబర్ 5 రాత్రి తమిళనాడు నుంచి చేర్యాల మీదుగా హుస్నాబాద్‌కు ఓ లారీ డ్రైవర్ లోడ్‌తో బయల్దేరాడు. లారీలో డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్య ఉన్నారు. ఐతే చీకట్లో వాళ్లు వెళ్లే రూటు అర్థంకాక తికమకపడ్డారు. దీంతో ఫోన్‌లో గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నారు.
సిద్ధిపేట జిల్లాలో ఓ లారీ డ్రైవర్ గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా గమ్యానికి వెళ్లాలనుకున్నాడు. కానీ తీరా చూస్తే కథ అడ్డం తిరిగింది. మ్యాప్‌లో రోడ్డుంది గానీ కళ్ల ముందు పెద్ద ప్రమాదం కనిపించింది. సెప్టెంబర్ 5 రాత్రి తమిళనాడు నుంచి చేర్యాల మీదుగా హుస్నాబాద్‌కు ఓ లారీ డ్రైవర్ లోడ్‌తో బయల్దేరాడు. లారీలో డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్య ఉన్నారు. ఐతే చీకట్లో వాళ్లు వెళ్లే రూటు అర్థంకాక తికమకపడ్డారు. దీంతో ఫోన్‌లో గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నారు. ఐతే వారికి రూటు చూపించడంలో గూగుల్ వారిని ‘తప్పుదోవ పట్టించి’ ప్రమాదంలో పడేసింది. సిద్దిపేట జిల్లా గౌరవెల్లి రిజర్వాయర్ చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటే అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్లలోకి సరాసరి చేర్చింది. దీంతో లారీ నీళ్లలో కూరుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీళ్లు రోడ్లపై నిలిచిపోయాయని ఇద్దరూ భావించారు. అయితే వారు ముందుకు వెళ్లేకొద్దీ నీళ్ల లోతు పెరిగిపోతుండటంతో ఎందుకో అనుమానం వచ్చి లారీని నిలిపివేశారు. కొద్ది సేపటికే లారీ క్యాబిన్ వరకు నీళ్లు చేరుకున్నాయి. ఎక్కడో తప్పు జరిగిందని గ్రహించిన వారిద్దరూ మెల్లగా కిందకు దిగి సమీపంలోని స్థానికుల వద్దకు వెళ్లారు. సమీపంలోని రామవరం గ్రామస్థులకు జరిగింది తెలియజేశారు. స్థానికులు లారీకి తాళ్లు కట్టి అతి కష్టం మీద రోడ్డు మీదకి తీసుకొచ్చారు. నందారం స్టేజీ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి బైపాస్ రోడ్డు మీదుగా లారీనీ అక్కడి నుంచి మళ్లించడంతో ప్రమాదం తప్పింది. లేదంటే అదే రోడ్డనుకుని మృత్యువుని వెతుక్కుంటూ సరాసరి నదిలోకి వెళ్లిపోయేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: బయటికొచ్చిన సలార్ న్యూ రిలీజ్ డేట్! | Day1 దిమ్మతిరిగే కలెక్షన్స్
హిట్ మ్యాన్ చాప్టర్ 1 టీజర్‌కు.. దిమ్మతిరిగే రెస్పాన్స్
Siri Hanmanth: వావ్ !! జవాన్ సినిమాలో మెరిసిన సిరి హనుమంత్
Allu Arjun: నొచ్చుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.. ఎందుకంటే ??
Ravinder Chandrasekar: ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ఛీటింగ్ కేసులో అరెస్ట్..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

