Turmeric Water : ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పసుపు నీరు తాగితే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

అలాగే, బరువు తగ్గాలనుకునే వారు కూడా ప్రతిరోజూ ఉదయం పసుపు నీటిని తీసుకోవాలి. ఎందుకంటే పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది కొవ్వును పెంచే కణజాలం ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దీని వల్ల బరువు తగ్గవచ్చు. పసుపు నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజూ ఉదయాన్నే పసుపు నీటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా మధుమేహానికి..

Turmeric Water : ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పసుపు నీరు తాగితే... ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
Turmeric Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 09, 2023 | 7:23 AM

ఆహారం, చర్మ సంరక్షణలో పసుపు ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ సి ఉన్నాయి. సాంప్రదాయ భారతీయ ఆయుర్వేద వైద్యం చాలా కాలంగా పసుపును చర్మ సమస్యలు, అలెర్జీలు. కీళ్ల నొప్పుల వంటి వ్యాధులకు నివారణగా ఉపయోగిస్తోంది. ఇక నుంచి రోజూ పసుపు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. పసుపు నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. అలాగే, పసుపు నీరు శరీరం నుండి విషాన్ని తొలగించి, శరీరాన్ని పునరుజ్జీవింపజేసేందుకు సహజమైన డిటాక్స్‌గా పనిచేస్తుంది. పరగడుపునే పసుపు నీళ్లు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

యూరోపియన్ రివ్యూ ఫర్ మెడికల్ అండ్ ఫార్మకోలాజికల్ సైన్సెస్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, పసుపు జీర్ణ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, పసుపు కడుపు నొప్పి లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండటం వల్ల గుండె జబ్బులు వస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, రక్త నాళాల లైనింగ్‌ను మెరుగుపరచడంలో పసుపు సహాయపడుతుంది. పరగడుపునే ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు నీరు తాగడం వల్ల శరీరంలో మంటతో పోరాడుతుంది. పరగడుపునే పసును నీళ్లు తాగటం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. ప్రతిరోజూ ఉదయం పసుపు నీటిని తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి లక్షణాలతో పోరాడడంలో సహాయపడతాయి. అలాగే, బరువు తగ్గాలనుకునే వారు కూడా ప్రతిరోజూ ఉదయం పసుపు నీటిని తీసుకోవాలి. ఎందుకంటే పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది కొవ్వును పెంచే కణజాలం ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దీని వల్ల బరువు తగ్గవచ్చు. పసుపు నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజూ ఉదయాన్నే పసుపు నీటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి, చర్మపు రంగును మెరుగుపరుస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. పసుపు నీరు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు కూడా ఇది గొప్ప పానీయం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!